IND vs PAK: భారత్-పాక్ హైఓల్టేజ్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ ఇదే..!
- ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
- దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్
- పిచ్ ఫాస్ట్ బౌలర్లకు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా..?.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లతో పాటు.. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లు ఎనిమిది నెలల తర్వాత తలపడనున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత డూ ఆర్ డై పరిస్థితిలో ఉన్నందున.. రెండు జట్లకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు ఇది కీలకమైన మ్యాచ్ కానుంది. మరోవైపు, 2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని, సెమీఫైనల్స్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. బంగ్లాదేశ్‌పై తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత మెన్ ఇన్ బ్లూ జట్టు బరిలోకి దిగుతోంది మరియు టోర్నమెంట్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్ జరిగే దుబాయ్ స్టేడియం పిచ్ పరిస్థితి ఎలా ఉంటుంది.. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు లేదా స్పిన్నర్లకు సహకరిస్తుందా..? అనే విషయాలు తెలుసుకుందాం..
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
దుబాయ్ పిచ్ పరిస్థితులు:
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ సులభం కాదు. కొత్త బంతితో ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ ప్రారంభంలో మహమ్మద్ షమీ మరియు హర్షిత్ రాణా ఈ పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. గత మ్యాచ్‌లో షమీ 5 వికెట్లు, రాణా 3 వికెట్లు పడగొట్టారు. మరోవైపు.. టాస్ గెలిచిన జట్టు ఈ గ్రౌండ్ లో లక్ష్యాన్ని ఛేదించడానికి ఇష్టపడుతుంది. ఈ మైదానంలో జరిగిన 59 మ్యాచ్‌లలో, బ్యాటింగ్ చేసిన జట్టు 22 సార్లు గెలిచింది, ఛేజింగ్ జట్టు 35 సందర్భాలలో విజయం సాధించింది.
టాస్ కీలకం:
పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేస్తే నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హరిస్ రౌస్ ఈ పరిస్థితుల నుంచి ప్రయోజనం పొందగలుగుతారు. అలాగే, స్పిన్నర్లకు కూడా కొంత సహకరిస్తుంది. టీమిండియాలో కూల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ముఖ్యమైన స్పిన్నర్లు ఉండగా.. పాకిస్తాన్‌లో అబ్రార్ అహ్మద్, ఖుష్దిల్ షా ఉన్నారు.
ఆదివారం వాతావరణ అప్‌డేట్:
ఫిబ్రవరి 23న దుబాయ్‌లో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశముండదు.. కాబట్టి అభిమానులు మ్యాచ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. గరిష్ట ఉష్ణోగ్రత 32°C, కనిష్ట ఉష్ణోగ్రత 23°C మధ్య ఉంటుంది. తేలికపాటి మేఘాలు, గాలి వేగం 30 km/h ఉండవచ్చు. సాయంత్రం వేళ కొన్ని చోట్ల తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది.
వన్డేలో పాక్ vs భారత్ హెడ్-టు-హెడ్
వన్డే ఫార్మాట్‌లో పాకిస్తాన్, ఇండియా ఇప్పటివరకు 153 సార్లు తలపడ్డాయి. ఈ 153 వన్డే మ్యాచ్‌లలో పాకిస్తాన్ 73 సార్లు భారత్‌ను ఓడించగా.. భారత్ 57 సార్లు విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. పాకిస్తాన్, ఇండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ అక్టోబర్ 1, 1978న క్వెట్టాలో జరిగింది. ఇందులో భారత్ నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య జరిగిన వన్డేలో చివరిసారిగా అక్టోబర్ 14, 2023న అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!