ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండవ సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను 50 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో కివీస్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 362 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా, దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 312 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Mohammed Shami: టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని ఉద్దేశించి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం దారుణమైన విమర్శలు చేయడంపై క్రీడాభిమానులు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. దేశం కోసం ఆడుతున్న వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మతాన్ని ఆపాదించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంజన్ మాసంలో ‘రోజా’ను పాటించకుండా, మ్యాచ్ సమయంలో షమీ నీరు, ఇతర డ్రింక్స్ తాగడాని షాబుద్దీన్ అన్నారు. షమీని క్రిమినల్‌గా పోల్చుతూ విమర్శించారు.
Mohammed Shami: టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ, షమీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. షమీ ఓ క్రిమినల్ అంటూ విమర్శలు చేశారు. క్రికెట్ మ్యాచ్ కారణంగా షమీ రంజాన్ మాసంలో ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ మ్యాచ్ సమయంలో షమీ నీరు తాగుతూ, ఇతర కూల్ డ్రింక్స్ తాగుతూ…
IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ పొందనుంది. పాకిస్తాన్‌కు ఐసీసీ నుండి దాదాపు రూ. 2 కోట్ల 37 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఈ టోర్నీలో ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు 1.40 లక్షల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 22 లక్షల రూపాయలు ఇవ్వనుంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్‌కు ప్రైజ్ మనీ అందుతుది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలిపై టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడని అన్నారు. రోహిత్ తన సహచరులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం టీమిండియాకు మంచి విషయం అని శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డారు.
Wasim Akram: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా ఓడిపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ఈ మెగా ఐసీసీ ఈవెంట్‌కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో గెలవలేదు. ఆతిథ్య జట్టు సెమీస్‌కి చేరకుండానే ఇంటి దారి పట్టడంపై పాక్ మాజీ ప్లేయర్లు, జట్టు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కనీస పోరాటం లేకుండా ఓడిపోవడంపై ఫైర్ అవుతున్నారు.