Virat Kohli: క్రికెట్ ప్రపంచంలోనే గ్రేటెస్ట్ రైవలరీగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ని చూస్తారు. రెండు దేశాల్లో కోట్లాది మంది అభిమానులు కూడా తమ తమ జట్లు గెలవాలని, తమ స్టార్లు సెంచరీలతో చెలరేగాలని కోరుకుంటారు. దశాబ్ధాలుగా ఆ శతృత్వం కొనసాగుతూనే ఉంది. అయితే, పాకిస్తాన్‌కి ఒకే ఒక చింత ఏంటంటే, ఇప్పటి వరకు ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌ని కొట్టలేకపోతోంది. పాక్‌తో పోలిస్తే మెరుగైన ట్రాక్ రికార్డ్ భారత్ సొంతం. Read Also: Belagavi: కర్ణాటక-మహారాష్ట్ర మధ్య…
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు.
వరుస ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ తప్పుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశం వరుస ఓటములతో ఈ పోటీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఇండియా సెమీఫైనల్ చేరింది. ఓడిన పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔటైంది. చివరిసారి 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు టీమ్సే తలపడ్డాయి. అందులో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఓ ఐసీసీ టోర్నీలో ఇండియాను పాక్ ఓడించడం అదే తొలిసారి. ఇప్పుడు…
భారత్ పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 2 వికెట్ల నష్టానికి వద్ద పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్, శ్రేయస్ అయ్యారు ఇద్దరూ నిలకడగా ఆడటం కలిసొచ్చింది. విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను భారత్ 241 పరుగులకు ఆలౌట్ చేసింది.
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి పాకిస్థాన్ 241 పరుగుల వద్ద కుప్పకూలింది. హర్షిత్ రాణా వేసిన 49.4 ఓవర్‌కు ఖుష్దిల్ షా (38) ఔటయ్యాడు. దీంతో పాక్ 241 పరుగులకు ఆలౌటైంది.
నేడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్ 241కి ఆలౌట్ అయ్యింది. తొలుత పాకిస్థాన్ 47 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (47), సౌద్ షకీల్ (62) 104 పరుగులు జోడించారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. భారత్-పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఫిబ్రవరి 23న (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. కాగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌లో గెలిచి ఎంతో ఉత్సాహంతో ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైంది. టీమిండియా, పాకిస్తాన్ జట్లు సూపర్ సండే మ్యాచ్ కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. నేడు ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌లోని కరాచీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ విడుదలైంది. సన్‌రైజర్స్ మార్చి 23న (ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా తొలి మ్యాచ్ ఆడనుంది.
తాజాగా విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.