IND vs PAK: సెంచరీతో మెరిసిన విరాట్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
- భారత్ పాకిస్థాన్‌పై ఘన విజయం
- సెంచరీ పూర్తి చేసిన విరాట్
- 42.3 ఓవర్ల వద్ద 244/4 పరుగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. 4 వికెట్ల నష్టానికి వద్ద పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. 42.3 ఓవర్‌కు ఫోర్ బాదిడంతో సెంచరీతో పాటు భారత్ ఘన విజయం సాధించింది. భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్, శ్రేయస్ అయ్యారు ఇద్దరూ నిలకడగా ఆడటం కలిసొచ్చింది. విరాట్ సెంచరీ పూర్తి చేశాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌ను భారత్ 241 పరుగులకు ఆలౌట్ చేసింది. దీని తర్వాత.. టీం ఇండియా బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్ వేశాడు. కాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (20; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. షహీన్ షా అఫ్రిది వేసిన ఐదో ఓవర్లో ఐదో బంతికి ఫోర్ బాదిన రోహిత్.. చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాడు.
READ MORE: AP: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. హోటల్ నిర్వాహకుడిపై దాడి
Also Read
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. సమయంలో, విరాట్ కోహ్లీ కూడా తన వన్డే కెరీర్‌లో 14 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. అంతలో అబ్రార్ అహ్మద్ వేసిన 17.3 ఓవర్‌కు శుభ్‌మన్ గిల్ (46) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 100 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. గిల్ పెవిలియన్‌కు చేరుకోగానే శ్రేయస్ అయ్యార్ బరిలోకి దిగాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ ఇద్దరూ చాకచక్యంగా ముందుకు సాగారు. విరాట్ కోహ్లీ 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నసీమ్ షా వేసిన 26.1 ఓవర్‌కు బౌండరీ బాది అర్ధ శతకం అందుకున్నాడు. అబ్రార్ అహ్మద్ వేసిన 37 ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖుల్‌దిష్ షా వేసిన 38.5 ఓవర్‌కు శ్రేయస్ అయ్యర్ (56) ఔటయ్యాడు. ఇమామ్ ఉల్ హక్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. షహీన్ షా అఫ్రిది వేసిన 40 ఓవర్‌లో చివరి బంతికి హార్దిక్ పాండ్య (8) రిజ్వాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. షహీన్ షా వేసిన 42 ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!