వరుస ఓటములతో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ తప్పుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య దేశం వరుస ఓటములతో ఈ పోటీ నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్ గెలిచిన ఇండియా సెమీఫైనల్ చేరింది. ఓడిన పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔటైంది. చివరిసారి 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఈ రెండు టీమ్సే తలపడ్డాయి. అందులో ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఓ ఐసీసీ టోర్నీలో ఇండియాను పాక్ ఓడించడం అదే తొలిసారి. ఇప్పుడు భారత్ ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
READ MORE: Post Office Scheme: రోజుకు రూ. 50 పెట్టుబడితో లక్షల్లో లాభం.. రిస్క్ లేని స్కీమ్
డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. సొంతగడ్డపై టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఇటీవల బరిలోకి దిగిన ఆ జట్టు న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరకు పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయింది.
READ MORE: IND vs PAK: సెంచరీతో మెరిసిన విరాట్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
అనంతరం రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ భారత్‌తో పోటీ పడింది. టాస్ గెలిచి బరిలోకి దిగిన పాక్ 241 పరుగులకు అలౌట్ అయ్యింది. భారత్‌కు 242 లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. విరాట్ సెంచరీ పూర్తి చేసిన అద్భుత విజయాన్ని అందించాడు. శ్రేయస్ ఆఫ్ సెంచరీతో మెరిశాడు. గిల్ అర్ధ శతానికి దగ్గరగా వచ్చి ఔట్ అయ్యాడు. 42.3 ఓవర్‌కు ఫోర్ బాదిన కోహ్లీ.. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ బౌండరీతో భారత్ విజయం కూడా సాధించింది. దీంతో పాకిస్థాన్ ఇంటికి, భారత్ సెమీఫైనల్‌లోకి వెళ్లాయి.