భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అద్భుతంగా ఆడాడు. కోహ్లీ పాకిస్తాన్‌పై సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. పాకిస్తాన్‌పై ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను భారత కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. అంతే కాకుండా.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చాలా రికార్డులు సృష్టించాడు.
Read Also: IND vs PAK: క్రేజ్ అంటే ఇదేరా.. పెళ్లి వేడుకలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లైవ్
రోహిత్ శర్మను అధిగమించిన కోహ్లీ
పాకిస్తాన్‌పై అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్‌పై ఐసీసీ వన్డే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కోహ్లీ 9 ఇన్నింగ్స్‌లలో 400* పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 7 ఇన్నింగ్స్‌లలో 370 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 6 ఇన్నింగ్స్‌లలో 321 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 4 ఇన్నింగ్స్‌లలో 248 పరుగులు, శిఖర్ ధావన్ 4 ఇన్నింగ్స్‌లలో 210 పరుగులు, సురేష్ రైనా 3 ఇన్నింగ్స్‌లలో 156 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 287వ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్‌తో జరిగిన 17 వన్డే ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం మీద వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. అందులో 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతని స్ట్రైక్ రేట్ 94 కంటే ఎక్కువగా నమోదైంది. బెస్ట్ స్కోర్ 183 పరుగులు.
Read Also: IND vs PAK: సెంచరీతో మెరిసిన విరాట్.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి అందరి నోళ్లు మూయించాడు. గత కొన్ని మ్యాచ్‌లలో విఫలమైనప్పటికీ.. అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మ్యాచ్లో సెంచరీ చేసి విమర్శకులు నోళ్లు మూయించాడు. నేను ఫాంలోనే ఉన్నానంటూ మళ్లీ అందరికీ గుర్తు చేశాడు. ఈ సెంచరీతో అభిమానులందరూ ఎంతో ఖుషీ అవుతున్నారు. ఇంకా బోలెడంతా ఫ్యూచర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.