బీసీసీఐ నిర్ణయంపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు తప్పుబట్టారు. ఈ క్రమంలో.. ఈ నిర్ణయాన్ని సవరించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో చేరారు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతని చూపుడు వేలుకు గాయమైంది. దీంతో.. క్రికెట్ అభిమానులు ఈ సీజన్‌కు దూరమవుతాడని భావించినప్పటికీ.. గత నెలలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో తన జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.
మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే.. ఎంతో ఇష్టపడే ఐపీఎల్లో ఆటతో పాటు గొడవలు కూడా ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎన్నో వివాదాలు నడిచాయి.
నవంబరులో జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోకుండా ఉండిపోయాడు. అయితే.. ఇప్పుడు శార్దూల్‌కు ఐపీఎల్ 2025లో ఆడే అవకాశం లభించనుంది. దేశీయ క్రికెట్లో బ్యాట్, బంతితో బాగా రాణిస్తున్న శార్దూల్.. ఐపీఎల్లో తన ప్రతిభను చూపించే అవకాశం రానుంది.
Virat Kohli : బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్స్ విదేశీ టూర్ లో ఉన్నప్పుడు వారి వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లొద్దు అంటూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని కోహ్లీ తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఆటగాళ్లు చాలా ఒత్తిడితో ఉంటారని.. అలాంటి సమయంలో వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ఉండటంలో తప్పులేదన్నాడు. వాళ్లకు కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఒత్తిడిని అధిగమించి మెరుగ్గా ఆడుతారంటూ చెప్పాడు.…
Mohammed Shami: ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ సమయంలో, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీపై ముస్లిం అత్యున్నత సంస్థ నుంచి విమర్శలు వచ్చాయి. రంజాన్ మాసంలో షమీ ‘‘రోజా’’ పాటించకపోవడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ విమర్శలు గుప్పించారు. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఉపవాసం ఉండకుండా నీరు, ఇతర డ్రింక్స్ తాగడాన్ని షాబుద్దీన్ తప్పుపట్టారు. షమీ ఒక ‘‘క్రిమినల్’’ అంటూ దుయ్యబట్టారు. అయితే, ఈ విషయంపై షమీకి మద్దతుగా యావత్…
2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్ మ్యాచ్ (మార్చి 15) శనివారం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ జట్లు తుది పోరులో తలపడ్డాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్ నేరుగా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది.
Virat Kohli : విరాట్ కోహ్లీ సెన్సేషనల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఒక్క మ్యాచ్ కోసం తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానంటూ ప్రకటించేశాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన రిటైర్మెంట్ మీద యూటర్న్ తీసుకున్నాడు విరాట్. దానికి కారణం ఒలంపిక్స్. 2028లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలంపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ఐసీసీ (ICC) ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అయితే.. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్యకరం.