IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు వేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ ను సాధించింది. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు.. రవీంద్ర జెడేజా, వరుణ్ చక్రవర్తిలు రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర పటేల్, హార్దిక్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
ఇక లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆటను మొదలుపెట్టిన టీమిండియా బ్యాట్స్మెన్స్ శుభమన్ గిల్ 30 పరుగుల వద్ద మొదటి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. ఆ తర్వాత 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా వెనుతిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ టీమిండియా స్కోర్ బోర్డ్ పై ఒక్కో పరుగు చేరుస్తు.. టీమ్ ఇండియాను విజయానికి చేరువ చేశారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. స్కోర్ బోర్డ్ వేగం నెమ్మదించింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగులు చేసి కీలక సమయంలో టీమిండియాను ఆదుకున్నాడు. ఇక కీపర్ కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి విజయానికి అవసరమైన పరుగులు సాధించి టీమిండియాను ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేర్చాడు.