ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు. గత మ్యాచ్‌లో మాథ్యూ షార్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. మ్యాచ్ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా ఫిట్‌గా లేడని చెప్పాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్‌కు జోడీగా మరో కొత్త ఓపెనర్ రానున్నాడు.
Read Also: Prashant Kishor: వ్యూహం మార్చిన ప్రశాంత్ కిషోర్.. తమిళనాడులో విజయ్‌కు సాధ్యమేనా?
ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరిలో షార్ట్ గాయపడ్డాడు. అతను ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో అతను ఎక్కువగా బౌండరీలు కొట్టడానికే ప్రయత్నించాడు. కానీ కేవలం 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా.. యువ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. షార్ట్ స్థానంలో ట్రావిస్ హెడ్‌తో ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఆరోన్ హార్డీ కూడా బెంచ్‌లో ఉన్నాడు. అతనికైనా ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. కాగా.. నిన్న ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా రద్దు అవడంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లింది.
Read Also: Posani Krishnamurali: పోసాని కృష్ణ మురళికి అస్వస్థత