ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. కాగా.. ఆఫ్గాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను పెవిలియన్ బాట పట్టాడు. ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం.. సత్యవర్థన్ స్టేట్మెంట్ ఇవ్వాలని పిటిషన్
ఆఫ్గానిస్తాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్‌లో 95 బంతుల్లో 85 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రెహమత్ షా 12, కెప్టెన్ షాహిది 20 పరుగులు చేసి ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు. గుల్బాదిన్ 4, రషీద్ ఖాన్ 19, నూర్ అహ్మద్ 6 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా తలో 2 వికెట్లు పడగొట్టారు. నాథన్ ఇల్లీస్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ సంపాదించారు.
Read Also: SLBC Incident : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8మంది సజీవ సమాధి