ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. శుక్రవారం ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. వర్షం కారణంగా ఆట రద్దైంది. 274 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 12.5 ఓవరల్లో ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు చేసింది. అయితే వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది. నాలుగు పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకుంది.
Read Also: Car Mileage: వేసవిలో కారు మైలేజ్ తగ్గడానికి గల కారణాలివే..?
మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్గానిస్తాన్ బ్యాటర్లలో సెదికుల్లా అటల్ 85 పరుగులతో రాణించాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశాడు. ఆఫ్గాన్ బ్యాటర్లలో రెహమత్ షా 12, కెప్టెన్ షాహిది 20 పరుగులు చేసి ఔటయ్యాడు. నబీ ఒక్క పరుగుకే రనౌట్ అయ్యాడు. గుల్బాదిన్ 4, రషీద్ ఖాన్ 19, నూర్ అహ్మద్ 6 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. స్పెన్సర్ జాన్సన్, ఆడం జంపా తలో 2 వికెట్లు పడగొట్టారు. నాథన్ ఇల్లీస్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ సంపాదించారు.
Read Also: Skype Shutting Down: 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెర.. స్కైప్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!