ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. కాగా.. తుది జట్టులో స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌కు చోటు దక్కలేదు. దాంతో పాటు.. స్టార్ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్‌లను రిజర్వ్‌లుగా చేర్చారు. అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకున్న ఫినిషర్ కి ప్లేయింగ్ 15 టీమ్‌లో చోటు దక్కకపోవడంపై… క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
WhatsApp: ఇకపై కొత్త ఖాతాల నుండి వాట్సప్ సందేశాలు రావా..?
ఈ సందర్భంగా.. మాజీ క్రికెటర్, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, రోహిత్ శర్మ, ఐపీఎల్ 2016 సీజన్ నుంచి పెద్దగా పొడిచేసిందేమీ లేదని విమర్శించారు. ఐపీఎల్ ఫామ్ కారణంగా రింకూ సింగ్‌ని ప్లేయింగ్ 15 నుంచి తప్పించడం మాత్రం కరెక్ట్ కాదన్నారు. మరోవైపు.. టీమిండియా మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ స్పందిస్తూ, ఐపీఎల్ 2024 పర్ఫామెన్స్ రిపోర్ట్ ఆధారంగానే ప్లేయర్లను సెలక్ట్ చేశారనుకుంటే, మహ్మద్ సిరాజ్, ఆర్‌సీబీ తరుపున వికెట్లు ఏమైనా తీశాడా? సూర్యకుమార్ యాదవ్, గాయంతో చాలా మ్యాచులు ఆడనేలేదు. అలాంటిది రింకూ సింగ్ విషయంలో మాత్రం ఐపీఎల్ ఫామ్ బాగోలేదని 15 మందిలో చోటు ఇవ్వకపోవడం ఏంటి? ఇది కచ్ఛితంగా అన్యాయమే.. రింకూ సింగ్‌కి న్యాయం జరగాలి’ అంటూ కామెంట్ చేశాడు ..
Allola Indrakaran Reddy: బీఆర్‌ఎస్ కు మరో దెబ్బ.. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తీవ్ర ఆరోపణలు చేశాడు. కొందరు ప్లేయర్లు కేవలం వారి పాపులారిటీ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోతున్నారని తెలిపారు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ 2024 సీజన్‌లో అదరగొట్టిందేమీ లేదు.. కానీ.. ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్. కాబట్టే టీ20 వరల్డ్ కప్‌కి సెలక్ట్ చేశారన్నారు. భారత జట్టు మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా రింకూ ఎంపిక కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రింకూను అన్యాయంగా బలిపశువును చేశారని ఆరోపించారు. నేను అస్సలు సంతోషంగా లేను అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తెలిపారు.