ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు మరో మ్యాచ్ జరుగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించి ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలని ఇరుజట్లు ఆశిస్తున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ మోస్తరు స్కోరు చేసింది. పంజాబ్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల దూబె మళ్లీ విఫలమయ్యాడు. ఏమీ పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 24 పరుగుల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 18.5 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లు విజృంభణతో ముంబై చిత్తుగా ఓడిపోయింది.