టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. అయితే.. టీమిండియా జట్టులో ఫినిషర్ రింకూ సింగ్ పేరు లేకపోవడంతో.. క్రికెట్ అభిమానులతో పాటు, పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. మరోవైపు.. అతని తల్లిదండ్రులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కేవలం రింకూ సింగ్ పేరు ట్రావెల్ రిజర్వుగా మాత్రమే ఉంది. మరోవైపు.. టీమిండియాకు ఫినిషర్ లేకుండానే మెగా టోర్నీలో ఆడేందుకు సిద్ధమవుతుంది.
అయితే.. టీమిండియాలో తన కొడుకు పేరు లేకపోవడంపై రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ స్పందించాడు. ‘రింకూకి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉంటుందని ఎన్నో ఆశలు ఉండేవి.. కానీ తుది జట్టులో పేరు లేకపోవడంతో కాస్త నిరాశ చెందాం. టీమ్ అనౌన్స్‌మెంట్ తర్వాత పేల్చడానికి టపాకాయలు, పంచడానికి స్వీట్లు కూడా తెచ్చి పెట్టుకున్నామన్నాడు. అయితే స్టాండ్ బై ప్లేయర్‌గా అయినా టీమ్‌లో చోటు దక్కడం సంతోషం’ అని తెలిపాడు.
CSK vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్..
మరోవైపు.. మెగా టోర్నీకి జట్టును ప్రకటించాక రింకూ సింగ్ తన తల్లికి ఫోన్ చేసి ఎమోషనల్ అయ్యాడు. అమ్మా, నా పేరు 15 మంది టీమ్‌లో లేదు. రిజర్వు ప్లేయర్‌గా వెళ్తున్నా.. అని ఏడ్చాడు. తుది జట్టులో లేనని తెలిసి గుండె పగిలినట్లైందని చెప్పాడు. కానీ.. రింకూ తల్లిదండ్రులు మాత్రం అతనికి ధైర్యం చెప్పారు. రింకూ సింగ్‌ది దృఢమైన సంకల్పం.. కచ్ఛితంగా మేం దేశం గర్వించేలా చేస్తాడు..’ అంటూ రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ర సింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా.. రిజర్వ్ ప్లేయర్లలో రింకూ సింగ్‌తో పాటు టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్, బౌలర్ ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. వీరంతా స్టాండ్ బై రిజర్వు ప్లేయర్లుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ కోసం టీమిండియాతో కలిసి యూఎస్‌ఏ వెళ్లనున్నారు. అయితే.. తుది 15 మంది జట్టులో ఎవరైనా గాయపడినా, మరేదైనా కారణాలతో ఆడకపోయినా వారి స్థానంలో రిజర్వు ప్లేయర్లు, ఆడే అవకాశం ఉంటుంది.