మళ్లీ హైదరాబాద్ రోడ్డు ఎక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగనున్నాయి. మంగళవారం చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సమక్షంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతికుమారి మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో షెడ్యూల్ చేయబడిన ఫార్ములా ఇ-ప్రిక్స్‌తో, ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్…
లోకేష్‌పై మంత్రి రోజా ఫైర్.. వైసీపీ నేతలను ఎందుకు చీపుర్లతో కొట్టాలి..? వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా?…
వైఎస్సార్ సెంటిమెంట్ లాగానే.. సీతక్క నియోజకవర్గం నుంచే యాత్ర ప్రారంభించా.. రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానని, హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. 20 శాతం మైనార్టీలు, 80శాతం మెజార్టీలను విభజించి పాలించిన విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. విభజించు పాలించు విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీ ప్రయత్నాన్ని.. ప్రజలకు చాటి చెప్పేలాగా రాహుల్ గాంధీ యాత్ర చేశారన్నారు. రాహుల్ గాంధీ…
పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. ! ఓవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఫైర్ అవుతూనే.. మరోవైపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. నన్ను నమ్ముకున్న వారి మనస్సులో ఏ పార్టీ ఉందో .. వారి అభీష్టానికి మేరకే పార్టీ మారుతాను. ఎవరో ఉరికిస్తే తొందరపడి ఏ పార్టీలో చేరను అన్నారు. తెలంగాణ వస్తే నీళ్లొస్తాయని, గిరిజనుల సమస్యలు తీరుతాయని భావించారు.. కానీ, అవేమి నెరవేరలేదు.. యావత్తు…
సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర నేతలు భేటీ.. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తో మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్ల పథకాలపై చర్చించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ వివరాలను సీఎంను అడిగి నేతలు తెలుసుకున్నారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా పరిణామం చెందడాన్ని మహారాష్ట్ర…
టాలీవుడ్ యంగ్ హీరో అరెస్ట్.. సినీ నటుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేసిన నవీన్ రెడ్డి.. కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఫోర్జరీ సంతకాలతో కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అభియోగాలు మోపారు.. సమారు రూ.55 కోట్లు మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై భాదితులు, ఎన్ స్క్వేర్ డైరెక్టర్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ మోసం…
అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదు.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా నందరెడ్డి కేసులో.. సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా నిందితులను ప్రశ్నిస్తోంది.. మరోవైపు, కేసులో విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్ రికార్డులో సంచలనం ఏమీ లేదన్నారు.. అవినాష్‌రెడ్డి ఫోన్‌ను ఆరోజే పోలీసులు చెక్ చేశారు. నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని.. కుట్ర…
ఊపిరి పోయే వరకు జగన్‌తోనే.. తన ఊపిరి పోయే వరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. ఇవాళ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు.. అయితే, చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాను, వైసీపీ జెండామోస్తానని అని ప్రకటించారు పోసానీ కృష్ణ మురళి..…
వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు.. కానీ, వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా. బి. వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్.. అయితే, 75.3 కిలోమీటర్ల పొడవుతో 15,993 కోట్ల రూపాయల వ్యయ అంచనాలతో వైజాగ్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని…