ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సామాజిక సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరోపారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్.. మొత్తంగా.. ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్ కోటాలో అభ్యర్థుల…
Virat Kohli Breaks Sachin Tendulkar's All-Time Record: స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఒక్కొక్కటిగా ప్రపంచ రికార్డులను తుడిచిపెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో క్రికెట్ లోనే అత్యధిక సెంచరీల రికార్డ్ ను కూడా సాధించే అవకాశం ఉంది. తాజాగా మరో రికార్డును విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 వేల పరుగులను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా నిలిచారు విరాట్ కోహ్లీ. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై…
వైసీపీలో విషాదం.. క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ కన్నుమూత.. శివరాత్రి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.. ఏపీ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గత అర్ధరాత్రి కన్నుమూశారు.. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.. ఇక, 2009లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసినా…
పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. సాగనంపడం ఖాయం.. పదవుల్లో ఉన్నామని అహంకారంతో ఉంటే.. ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయం అని హెచ్చరించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యాలయంలో సత్తెనపల్లి గంగమ్మకు ఆర్ధిక సాయం అందించిన నాదెండ్ల మనోహార్.. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబుపై ధ్వజమెత్తారు.. రూ. 5 లక్షల నష్టపరిహారం చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి అడ్డుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి.. ఇప్పటికీ నష్టపరిహరం ఇవ్వలేదంటూ విమర్శించారు.. దీంతో, బాధితురాలు గంగమ్మకు…
నేడే తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. రాష్ట్ర వ్యాప్తంగా సందడి టీఆర్ఎస్ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇవాళ 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు…
సోమేష్ కుమార్ విషయంలో అనుకున్నదే జరిగిందా..? తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేసిన విషయం విదితమే.. అయితే, సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లినా.. వెంటనే వీఆర్ఎస్ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం ఆది నుంచి జరుగుతూ వచ్చింది.. మరోవైపు.. ఈ ఏడాది చివర్లో ఆయన పదవీ కాలం ముగియనుండడంతో.. అప్పటి వరకు పదవిలో…
కొండగట్టు అంజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్.. పూర్ణకుంభంతో స్వాగతం సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు చేరుకున్నారు. అయితే.. 25 ఏళ్ల తరువాత తొలిసారి సీఎం హోదాలో కొండగట్టు…
ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ జగన్ సీరియస్.. డెడ్ లైన్ పెట్టేశారు..! 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీరియస్ అయ్యారు. జూన్ 30లోపు పనితీరు మార్చుకోవాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించాల్సి వస్తుందంటూ సంబంధిత ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు.. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గడప గడపకు కార్యక్రమంపై సోమవారం రోజు సీఎం వైఎస్ జగన్…
కేసీఆర్ కొండగట్టు పర్యటన రేపటికి వాయిదా.. షెడ్యూల్ ఇదే.. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని సీఎం కేసీఆర్ బుధవారం దర్శించుకోనున్నారు. నిజానికి మంగళవారమే సీఎం కేసీఆర్ కొండగట్టులో పర్యటిస్తారని అంతా భావించారు. కానీ.. ఆంజనేయస్వామిని దర్శించుకోవటానికి మంగళవారం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో తన పర్యటనతో భక్తులకు ఇబ్బందులు కలగకూడదని భావించిన సీఎం తన పర్యటనను బుధవారం వాయదా వేసుకున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. రేపు ఉదయం సీఎం…