పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..
ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదు.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు ఇకపై నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.. నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయి.. కానీ, నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఇక, పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కోట్ల రుపాయలు వెచ్చించి సంక్షేమ పథకాలు చేస్తోందన్న ఆయన.. దేశంలో పెద్ద నాయకురాలు సోనియాతో విభేదాలు పెట్టుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నేత వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. లోకేష్ దొడ్డి దారిలో పదవులు అనుభవించి పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. నాడు వైఎస్, జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో జనసముద్రం లాగా పాల్గొన్నారు.. యువకుడు రాహుల్ 160 రోజులలో పాదయాత్ర చేస్తే లోకేష్ 400 రోజులు చేయడం ఆ పార్టీకే నష్టం అన్నారుడు కృష్ణప్రసాద్. మరోవైపు, నా నియోజకవర్గంలో నా సొంత పార్టీ వారే ఇబ్బందులు పెట్టడం నిజం అన్నారు వసంత కృష్ణప్రసాద్.. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకోరాదని స్పష్టం చేశారని తెలిపారు.. ఎట్టిపరిస్థితుల్లో నేను పార్టీ వీడను.. ఎప్పటికి వైఎస్ కుటుంబంతోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు.. ఇక, దేవినేని ఉమా 379 కోట్ల ఇరిగేషన్ పనులు ఇస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి దగ్గర 20 కోట్ల రూపాయాలు తీసుకున్నాడు.. కొండపల్లికి చెందిన వ్యక్తి దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు.. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని అనుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇకపై నియోజకవర్గంలో ప్రతి కదలికపై సీఎం వైఎస్ జగన్ పర్యవేక్షిస్తారు.. మితిమీరితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
పోడు భూములపై సీఎం కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. ముందుగా స్పీకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం. అనంతరం పోడు భూముల విషయంలో సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల గురించి మాట్లాడటం చాలా తేలిక అన్నారు. ఆక్రమణ కాదు.. దురాక్రమణ అంటూ మండిపడ్డారు. అడవి బిడ్డలం అయితే.. అడవి అంతా కొట్టేస్తారా? అంటూ ప్రశ్నించారు. జెండాలు పట్టుకుని ధర్నాలు చేయడం కొన్ని పార్టీలకు అలవాటు అయ్యిందన్నారు. గిరిజనుల హక్కులు కాపాడాల్సిదే కానీ.. రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలా..కనుమరుగు కావాలా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. అడవులు ఎవరి పుణ్యంతో నాశనం అవుతున్నాయో చూశామని సీఎం కేసీఆర్ అన్నారు కమ్యూనిస్టులు వచ్చినా.. భట్టి వచ్చినప్పుడు చెప్పిన అన్నారు. పొడు భూములు సాగు చేసుకుంటున్న వారికి ఇస్తాం.. పొడు ఇలాగే కొనసాగాలా ముగింపు ఉండాలా? అంటూ ప్రశ్నించారు. పొడు భూముల పంపిణీ తర్వాత.. ఇంకా భూమి లేని గిరిజనులు ఉంటే గిరిజన బంధు ఇద్దాం అని చెప్పినాని సీఎం తెలిపారు. 11 లక్షల ఎకరాల భూమి పోయిందని, 66 లక్షల ఎకరాల భూమి కాపాడండి అని చెప్పిన అన్నారు. అధికారులకు.. ఓ సారి నిర్ణయం చేసి తేల్చేద్దం అని చెప్పినా అని సీఎం పేర్కొన్నారు.
సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తాం.. బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు..
మేం అధికారంలోకి వచ్చాక.. సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లిలో పేదల భూములను కబ్జా చేశారని, వారి పైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 11 వేల మీటింగ్ లు పెడతాం… బహిరంగ సభలు కాదని ఎద్దేవ చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ మూర్ఖత్వ పాలనను ప్రజలకు వివరించేందుకు ఈ మీటింగ్ లు అని బండిసంజయ్ అన్నారు. సీఎం ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ కు పరిమితం అయ్యారని తెలిపారు. ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఈ రోజుకి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుండే వస్తుందని, హైదరాబాద్ ను ఏ మేరకు అభివృద్ధి చేశారో స్పష్టం చేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు.
దుర్మార్గులు, దుష్టులు ఇద్దరు ఏకం అయ్యి బీజేపీకి మేయర్ కాకుండా చేశారని ఆరోపించారు.
అసెంబ్లీలో గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ముఖ్యమంత్రి..
రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర వివాదానికి కారణం అయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇది గతేడాది బడ్జెట్ ప్రసంగం అని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం పాత బడ్జెట్ ను చదువుతున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ కొన్ని నిమిషాల పాటు పాత బడ్జెట్ ను చదివారు. ఎట్టకేలకు కాంగ్రెస్ మంత్రి మహేష్ జోషి తప్పును గ్రహించి సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గెహ్లాట్ 2023-24 బడ్జెట్‌కు బదులుగా పట్టణ ఉపాధి మరియు కృషి బడ్జెట్‌పై మునుపటి బడ్జెట్ ను చదివారు. బడ్జెట్ కాపీని పొందడానికి ప్రభుత్వ అధికారులను హడావుడి చేయడంతోనే బడ్జెట్ లీక్ అయిందంటూ బీజేపీ ఛబ్రా ఎమ్మెల్యే గులాబ్ చంద్ కటారియా ఆరోపించారు. ముఖ్యమంత్రికి తప్పా మరెవరూ బడ్జెట్ కాపీని తీసుకోకూడదు, కానీ ఇక్కడ నాలుగురైదుగురు చేతిల్లోకి బడ్జెట్ వెళ్లిందని విమర్శించారు. 8 నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదువుతూనే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే ఆరోపించారు. నేను సీఎంగా పనిచేసిన సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పదేపదే పరిశీలించి చదివానని అన్నారు. పాత బడ్జెట్ చదివిని సీఎం చేతిలో రాష్ట్రం ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చని ఆమె విమర్శించారు. కేంద్రమంత్రి, జోధ్ పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పించారు. గెహ్లట్ జీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని.. ఈ ఏడాది బడ్జెట్ పై ప్రచారం చేసి పాత బడ్జెట్ చదివారని.. నవ్వాలో ఏడవాల్లో తెలియడం లేదని ట్వీట్ చేశారు.
కన్నీరు పెట్టిస్తున్న ఓ తండ్రి ఫోటో..తీవ్ర భావోద్వేగానికి గురైన ఫోటోగ్రాఫర్
టర్కీ భూకంపంలో వెలుగులోకి వస్తున్న ఎన్నో ఫోటోలు ప్రపంచంతో కన్నీరు పెట్టిస్తున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంది. సహాయచర్యల కోసం చూడకుండా తమ వారిని రక్షించుకునేందుకు ప్రజలు పడుతున్న తాపత్రేయం హృదయవిదారకంగా ఉంటున్నాయి. శిథిలాల కింద పుట్టిన శిశువు, పట్టగానే అనాథగా మారిన సంఘటనలు సిరియా దేశంలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఓ ఫోటో కన్నీళ్లు పెట్టిస్తోంది. తన బిడ్డ కోసం ఓ తండ్రి పడుతున్న బాధ వర్ణణాతీతంగా ఉంది. టర్కీకి చెందిన మెసుట్ హాన్సర్, శిథిలాల కింద ఉన్న తన కూతురు చేయిని బయటనుంచి పట్టుకుని నేనున్నాను తల్లి అంటూ విలపిస్తున్నాడు. గడ్డకట్టించే చలిలో ఒంటరిగా కూర్చోని శిథిలాల మధ్య నుంచి బయటకు వచ్చిన కూతరు చేయిని పట్టుకుని అక్కడే ఉన్నాడు. తన కూతరు ఇర్మాన్ చనిపోయిందని తెలిసినా.. అక్కడ నుంచి వెళ్లేందుకు ఆ తండ్రికి మనసు రావడం లేదు. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపంలో ఇర్మాన్ ఉంటున్న భవనం కుప్పకూలింది. దీంతో ఇర్మాన్ పై భవనం శిథిలాలు పడిపోయాయి. కేవలం ఆమె చేతి మాత్రమే బయట ఉంది. ఇది ఒక్క హాన్సర్ బాధే కాదు, తమ వారిని వెతుకుతూ ప్రమాదం నుంచి బయటపడిన వారు పిచ్చిగా తిరుగుతున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అడెమ్ అల్టాన్, హాన్సర్ ఫోటోను తీస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. హాన్సర్ తన బిడ్డ ఫోటోలను తీయాలని వణుకుతున్న స్వరంతో పిలిచారని.. ఆ సమయంలో నాకు మాటలు రాలేదని అల్టాన్ అన్నారు. ప్రపంచం తన, తన దేశం బాధను చూడాలని కోరుకున్నాడని తెలిపాడు. ఈ ఫోటో తీస్తున్న సమయంలో చాలా బాధగా అనిపించిందని, నేను ఏడుపు ఆపుకోలేకపోయాని అన్నారు.
రోహిత్ సూపర్ సెంచరీ..లీడ్‌లోకి టీమిండియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరుగుతోన్న తొలిటెస్టులో రెండో రోజు ఆట రసవత్తరంగా మారుతోంది. ఓవర్‌నైట్ స్కోర్ 77/1తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఇప్పటికే మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తనదైన శైలి ఆటతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మర్ఫీ వేసిన 63వ ఓవర్లో సూపర్ ఫోర్‌తో శతకం పూర్తి చేశాడు హిట్‌మ్యాన్, పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఒంటరి పోరాటంతో ఔరా అనిపిస్తున్నాడు. దీంతో ప్రస్తుతం టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 178 రన్స్ చేసింది. మొదట నిలకడగా ఆడుతున్న రోహిత్-అశ్విన్ జంటను టాడ్ మర్ఫీ విడదీశాడు. 41వ ఓవర్ తొలిబంతికి అశ్విన్ (23)ను ఔట్ చేశాడు. కాసేపటికే పుజారా (7)ను కూడా ఔట్ చేశాడు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 151 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ పూర్తయి రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే కోహ్లీ(12) ని కూడా ఔట్ చేసిన మర్ఫీ ఆసీస్ క్యాంప్‌లో సంతోషం నింపాడు. కనీసం సూర్యకుమార్ అయినా కుదురుకునే ప్రయత్నం చేస్తాడనుకున్న టీమిండియా ఫ్యాన్స్ ఆశలపై లియోన్ నీళ్లు చల్లాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్యను లియోన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే ఓ ఎండ్‌లో వరుస వికెట్లు పడుతున్నా రోహిత్ శర్మ మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
ఓ మై గాడ్ డాడీ ప్లేస్ లో… క్యారెక్టర్ డీలా హై…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని, భూషణ్ కుమార్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న షెహజాదా సినిమాపై బాలీవుడ్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈపాటికి వారం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పఠాన్ దెబ్బకి ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీగా ఉంది. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, తాజాగా షెహజాదా నుంచి ‘క్యారెక్టర్ డీలా 2.0’ సాంగ్ ని రిలీజ్ చేశారు. హిందీ కిక్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆల్రెడీ ‘క్యారెక్టర్ డీలా’ అనే సాంగ్ చేశాడు. ఈ పాట ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి పార్టీ వైబ్ ఉన్న పాటని కాస్త మార్పులు చేసి క్యారెక్టర్ డీలా 2.0 అని షెహజాదా సినిమాలో పెట్టారు. సాంగ్ లోని జోష్ కార్తీక్ ఆర్యన్ డాన్స్ లో కనిపిస్తుంది. షెహజాదా ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చిన ఈ పాట సినిమాపై హైప్ ని పెంచింది. తెలుగులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ గా ఉన్న ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ ప్లేస్ లో హిందీలో ‘క్యారెక్టర్ డీలా 2.0’ వచ్చేలా ఉంది. మరి టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన అల వైకుంఠపురములో సినిమా హిందీ బాక్సాఫీస్ ని కూడా రఫ్ఫాడిస్తుందేమో చూడాలి.
కొత్త సినిమా ట్రైలర్ వచ్చేసిందొచ్…
డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వాలి అనే కోరిక పుట్టిందో లేక వేరే కథలు తన దగ్గరికి వెళ్లడంలేదో తెలియదు కానీ యాక్షన్ సినిమాల వైపు వచ్చి ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు. ఏడాదికి అయిదారు సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ఆది సాయి కుమార్, హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. 2022లో ఆది సాయి కుమార్ అయిదు సినిమాలు నటించాడు, ఇందులో ‘అతిధిదేవోభవ’ సినిమా మాత్రమే కాస్త జనాలకి తెలిసింది. మిగిలిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో 2022 ఇచ్చిన బ్యాడ్ టైంని బ్రేక్ చేస్తూ హిట్ ట్రాక్ ఎక్కడానికి మార్చ్ 10న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. CSI సనతాన్ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాని చేస్తున్న ఆది సాయి కుమార్, ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. గోపీచంద్ మలినేని లాంచ్ చేసిన CSI సనతాన్ ట్రైలర్ చూడడానికి చాలా బాగుంది. విక్రమ్ అనే బిజినెస్ మాన్ ని ఎవరో మర్డర్ చేస్తే ఆ కేసు ఎంక్వయిరీ చేస్తున్న పోలిస్ పాత్రలో ఆది సాయి కుమార్ కనిపించాడు. ట్రైలర్ కట్ చేసిన విధానం అట్రాక్టివ్ గా ఉంది. ట్రైలర్ లో ప్లే చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. మర్డర్ చెయ్యబడిన విక్రమ్ పాత్రలో తారక్ పొంన్నప నటిస్తుండగా, నందినీ రాయ్ ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుంది. శివ శంకర్ దేవ్ డైరెక్ట్ చేస్తున్న ఈ CSI సనతాన్ సినిమాతో అయినా ఆది సాయి కుమార్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.