ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే…
రేపే కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష.. ఇవి పక్కా పాటించాల్సిందే.. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించడానికి సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏపీఎస్ఎల్పీఆర్బీ) కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష సెంటర్లోకి…
తిరుమలలో డ్రోన్ కలకలం.. టీటీడీ కీలక నిర్ణయం..! కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో డ్రోన్ కెమెరా వ్యవహారం కలకలం రేపుతోంది.. శ్రీవారి ఆలయం గగనతలంపై డ్రోన్ కెమెరాలకే కాదు విమానాలకు కూడా అనుమతి లేదు.. కానీ, తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియోలో శ్రీవారి ఆలయం పరిసరాలు విహంగ వీక్షణంలో స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగించే విషయం.. ఈ వ్యవహారం ఒక్కసారిగా టీటీడీ అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు..…
జీవో నంబర్1పై ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేం-సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ.. జీవో నంబర్ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది భారత అత్యున్నతన్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు.. ఈ నెల 23వ తేదీన హైకోర్టులో విచారణ ఉంది.. హైకోర్టు సీజే విచారణ జరపాలని ఆదేశించింది…
యోగి వేమన జయంతి.. సీఎం వైఎస్ జగన్ పుష్పాంజలి యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.. అయితే, యోగి వేమన జయంతిని ఏటా జనవరి 19వ తేదీన అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది… ఈ మేరకు ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.. కాగా, వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త. “విశ్వదాభిరామ వినురవేమ”…
జీవో నంబర్ 1.. సుప్రీంకోర్టు విచారణపై ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది.. బహిరంగ ర్యాలీలు, రోడ్‌షోలకు నియంత్రణ ఉండేలా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.. వివాదాస్పద జీవో నెంబర్ 1పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో…
కేశినేని బ్రదర్స్.. నాని కామెంట్లపై చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్న కేశినేని నాని వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, నాని తమ్ముడు కేశినేని చిన్ని.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం.. పార్టీ కోసం శ్రమిస్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ జీవితం మాకూ.. అందరికీ ఆదర్శం అన్నారు.. కానీ, గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు. ఇక, కేశినేని నాని కామెంట్లపై…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు.. వరుసగా సెంచరీలు బాదేస్తున్నాడు.. క్రికెట్ దిగ్గజాల రికార్డులను కొల్లగొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.. ఎంతో కాలంగా విరాట్ పూర్తి వైభవం కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల కోరిక కూడా తీరిపోయింది.. విరాట ఊచకోత.. పరుగుల వరద కోసం ఎదురుచూస్తోన్నవారికి కన్నుల పండుగ అవుతోంది.. ఈ సమయంలో ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. 2019 తర్వాత మొన్న ఆసియా కప్…
ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం వేల మంది క్రికెట్ అభిమానుల సందడితో దద్దరిల్లనుంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన మూడునెల వ్యవధిలోనే ఉప్పల్ లో టీమ్ ఇండియా న్యూజిల్యాండ్ వన్ డే మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది.
గులాబీ పార్టీ బాస్ ప్రసంగంపై ఉత్కంఠ మరో కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కె.చంద్రశేఖర్‌రావు.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత తొలి సారీ ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని…