జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక రీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి కూలం పేరుతో దూషించారంటూ వీరాంజనేయులు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.. దీంతో, జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెద్దపప్పూరు పోలీసుస్టేషన్‌లో పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.. కాగా, గతంలోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఈ తరహా కేసులు ఉన్నాయి.. కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పెద్దపప్పురు పోలీసులు గతంలోనూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇసుక రవాణా చేస్తుండగా కులం పేరుతో దూషించారని కృష్ణ ప్రబోధ ఆశ్రమం ప్రతినిధుల ఫిర్యాదుతో ఈ కేసు పెట్టారు.. ఇదే ఒకటే కాదు.. తాడిపత్రిలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులపై కేసులు పెడుతూ వచ్చారు పోలీసులు.. ఇదంతా ప్రతిపక్షాలను వేధించాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ కేసులు పెట్టిస్తుందని జేసీ బ్రదర్స్ ఆరోపిస్తున్న విషయం విదితమే.
భట్టి పై కేటీఆర్ సెటైర్.. 9 నెలల్లో పిల్లులు వస్తారు కానీ..
9 నెలల్లో మేము వస్తాం అని భట్టి అన్నారు.. 9 నెలల్లో పిల్లలు వస్తారు కానీ.. మీరు రారంటూ మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు. ఏది చెప్పినా.. పాత ముచ్చట చెప్తారని ఎద్దేవ చేశారు. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా చెప్పారన్నారు. సబ్జెక్టు తెలుసుకోకుండా మాట్లాడొద్దంటూ మండిపడ్డారు. 9 నెలల్లో మీరు రారు.. ఇంత చేసినా కూడా.. వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ కూడా వస్తారో కూడా తెలియదు.. బయటకి వెళ్ళేటట్టు ఉన్నారంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. మెట్రో చార్జీల పెంపులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఛార్జీల నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం మెట్రో మేనేజ్‌మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించిందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెట్రో చట్టం ప్రకారం.. మేనేజింగ్ బాడీలకు ఎంత ఛార్జీలు వసూలు చేయాలో నిర్ణయించే అధికారం ఉంటుంది. ప్రస్తుతం మెట్రో బాధ్యతలను ఎల్ అండ్ టీ నిర్వహిస్తోంది. చార్జీలు పెంచాలని నిర్ణయించి అమలు చేసింది ఆ సంస్థేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎల్‌అండ్‌టీకి తగిన సూచనలు చేశామని మంత్రి సమావేశంలో వెల్లడించారు. అడ్డగోలుగా ధరలు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు వివరించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో సమానంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. మెట్రో ప్రాజెక్టు విషయంలోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి విమర్శించారు. మహాకూటమి పాలిత రాష్ట్రాల్లో మహానగరాలకు భారీగా నిధులు కేటాయించారని, తెలంగాణలో మాత్రం మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు. భోజనం చేసే కార్యక్రమంలో ఎక్కడ కూర్చున్నా అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ఆరోపించారు.
రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది.. కానీ ఇంతలోనే..
తమవైపుకు రైలు అత్యంత వేగంతో దూసుకొస్తున్నా సరే.. కొందరు పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్న పొరపాటు జరిగినా తమ ప్రాణాలు పోతాయని తెలిసి కూడా.. పట్టాలు దాటేందుకు పట్టుబడుతుంటారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతే, మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. తాజాగా ఓ మహిళ సైతం పట్టాలు దాటబోయి రైలు కింద పడిపోయింది. అయితే.. అదృష్టవశాత్తూ ఆమె స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం బిహార్‌లోని గయా ప్రాంతంలో తన్‌కుప్ప రైల్వే స్టేషన్ నుంచి ఒక గూడ్సు రైలు బయలుదేరింది. సరిగ్గా అదే సమయంలో ఒక మహిళ రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించింది. తనవైపుకి రైలు దూసుకెళ్తున్నా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా పట్టాలు దాటాలని అడుగు ముందుకేసింది. అయితే.. ఈ కంగారులో ఆమె కాలుజారి పట్టాలపై పడింది. ఇంతలో ట్రెయిన్ దూసుకురావడంతో, పట్టాల మధ్య పడుకుంది. రైలు వెళ్లిపోయేంతవరకు కదలకుండా, అలాగే ఉండిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలు అయ్యాయి. పట్టాల కింద ఆమెను గమనించిన పోలీసులు.. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకొని, రైలు వెళ్లాక ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
వరల్డ్ వార్ 2 నాటి బాంబ్.. డిఫ్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు
ఇంగ్లండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబ్‌ను డిఫ్యూజ్ చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. అయితే.. ఇది పక్కా ప్లాన్‌తో చేసిన పేలుడు కాదని, ఆ బాంబ్‌ని డిఫ్యూజ్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సాధారణంగా ఇలాంటి బాంబులను గుర్తించినప్పుడు.. అక్కడి అధికారులు పక్కా ప్లాన్ వేసుకొని వాటిని, డిఫ్యూజ్ చేస్తుంటారు. ఒకవేళ డిఫ్యూజ్ చేయడానికి వీలు పడకపోతే.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని, వాటిని పేలుస్తారు. ఈ క్రమంలోనే నార్ ఫోల్క్ కౌంటీలో వరల్డ్ వార్ 2 నాటి బాంబ్ ఉందని మంగళవారం అధికారులు గుర్తించారు. దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. ఇది ప్రమాదంతో కూడుకున్న పని కావడంతో, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించారు. ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. మనుషులతో కాకుండా, రోబోలతో బాంబ్‌ని డిఫ్యూజ్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఆ బాంబు పేలిపోయింది. తద్వారా అక్కడ భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసిన పోలీసులు.. ఆస్తినష్టం ఎంత జరిగిందన్న విషయంపై అంచనా వేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం అక్కడ ప్రమాదం లేకపోవడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే జనాలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లొచ్చని వెల్లడించారు.
టర్కీ, సీరియాలలో భూప్రళయం.. 24 వేలు దాటిన మృతుల సంఖ్య
భూప్రళయం ధాటికి శిథిలమయమైన టర్కీ, సిరియాలలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకూ ఆ రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 24 వేలు దాటింది. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండటంతో.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు.. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టర్కీలో ఒక్క శుక్రవారంనాడే 100 మందికి పైగా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కొన్ని చోట్ల.. హృదయ విదారక దృశ్యాలూ కనిపిస్తున్నాయి. బయటపడే మార్గం లేక.. మూత్రం తాగి తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో.. అక్కడి శ్మశానాలు మృతదేహాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత భీకరమైన భూప్రళయంగా టర్కీ అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. ఈ భూకంపం ధాటికి టర్కీ తీవ్రంగా నష్టపోయిందని, తమకు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. మరోవైపు.. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా కలిపి శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. ఇదిలావుండగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటిదాకా టర్కీలో 19 వేల మందికిపైగా మరణించారని తేలింది. భవనాలన్నీ శిథిలాలు అవ్వడంతో.. 75 వేల మందికి పైగా జనం నిరాశ్రయులైనట్లు అక్కడి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించారు. 12 వేలకు పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి. సిరియాలో 3,300 కు పైగా ప్రాణాలు కోల్పోగా.. చాలామంది నిరాశ్రయులు అయినట్లు అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.
రోహిత్ రికార్డు సెంచరీ.. భార్య రితిక పోస్ట్ ట్రెండింగ్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు తడబడిన వేళ నాగ్‌పూర్ పిచ్‌పై శతకం బాది అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి భార్య రితికా సజ్దే కూడా రోహిత్‌ను కొనియాడింది. “లవ్ యూ రోహిత్” అంటూ ప్రేమను కురిపించింది. కాగా రితిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అప్‌డేట్లు పంచుకోవడంతో పాటు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టా స్టోరీలో రోహిత్ శర్మ ఫోటో షేర్ చేసిన రితిక.. ఫింగర్స్ క్రాస్డ్ ఎమోజీని జత చేసింది. వీటికి రీప్లేస్‌మెంట్ పంపించు అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఈ పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. కాగా రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న ప్రతిసారి రితిక ఫింగర్స్ క్రాస్ చేసి.. తమకు అనుకూల ఫలితం రావాలంటూ ప్రార్థించిన దృశ్యాలు గతంలో వైరల్ అయ్యాయి. ఇక తన మేనేజర్‌గా పనిచేసిన రితికతో ప్రేమలో పడ్డ రోహిత్ 2015లో ఆమెను పెళ్లాడాడు. వారికి కూతురు సమైరా శర్మ సంతానం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 212 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేశాడు. టెస్టు కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి శతకం. అదే విధంగా ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.
మర్ఫీకి 7 వికెట్లు.. 141 ఏళ్ల రికార్డు బద్దలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ టాడ్ మర్ఫీ అదరగొట్టాడు. కీలక భారత ప్లేయర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 7 వికెట్లతో రెచ్చిపోయాడు. సహచర సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్ తడబడిన వేళ.. అరంగేట్ర టెస్టులోనే ఔట్ ఆఫ్ ది బాక్స్‌గా వచ్చి రికార్డులు సృష్టించాడు. రెండో రోజు ఆట సందర్భంగా తన తొలి ఐదు వికెట్లు హాల్ సాధించిన మర్ఫీ.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో డెబ్యూ టెస్టులోనే ఐదు వికెట్ల ఘనత సాధించిన 22 ఏళ్ల మర్ఫీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా స్పిన్నర్‌గా మర్ఫీ రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జోయ్ ప్లామర్ పేరిట ఉండేది. ప్లామర్ 1882లో ఇంగ్లాండ్‌తో జరగిన ఓ టెస్టు మ్యాచ్‌లో 22 ఏళ్ల 360 రోజుల్లో ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. ఇక 22 ఏళ్ల 87 రోజుల వయసులోనే ఈ ఘనతను సాధించిన మర్ఫీ.. 141 ఏళ్ల ప్లామర్ రికార్డును బ్రేక్ చేశాడు. అదే విధంగా మరో రికార్డును మర్ఫీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున అరంగేట్ర టెస్టులోనే ఐదు వికెట్లతో చెలరేగిన నాలుగో ఆఫ్‌స్పిన్నర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో స్కాట్ బొలాండ్, జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లియోన్ ఉన్నారు.
మరింత పైకి కదిలిన పసిడి ధర.. ఈ పరుగు ఆగదా..?
క్రమంగా భారీ పెరిగి కాస్త బ్రేక్ తీసుకున్నాయి పసిడి ధరలు.. దీంతో, సామాన్యులు సంతోషం వ్యక్తం చేశారు.. కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు ఏమీ నిల్వ లేదు.. ఎందుకంటే.. పసిడి ధరలు.. మళ్లీ పైపైకి కదులుతున్నాయి.. నిన్నటి నుంచి పసిడి పరుగు తిరిగి ప్రారంభమైంది.. ఇవాళ కూడా అదే దూకుడు కనిపిస్తోంది.. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ.52,600కు చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380కి ఎగిసింది. దీంతో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా పలుకుతోంది.. ఇక, ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350గా ట్రేడ్ అవుతోంది.. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,600గా.. 24 క్యారెట్ల ధర రూ.57,380గా పలుకుతోంది.. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,380గా ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,400గా.. 24క్యారెట్ల బంగారం ధర రూ.58,250కు చేరింది.. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650గా ఉంటే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,340కి ఎగిసింది.. ఇక, కేరళ, పుణెలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 ఉండగా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380గా ట్రేడ్ అవుతోంది.. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 దగ్గర ట్రేడ్ అవుతోంది.. మరోవైపు వెండి విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500గా, విజయవాడలో రూ.70,800గా, ఢిల్లీలో రూ.70,800గా, ముంబైలో రూ.70,800గా, కోల్‌కతాలో రూ.70,800గా, చెన్నైలో రూ.72,500గా కొనసాగుతోంది. అయితే, ఇప్పట్లో పసిడి పరుగు ఆగదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
ఆదిపురుష్ కి కొత్త కష్టం… ఓవర్సీస్ లో కష్టమే
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ ఏ సమయంలో ఆది పురుష్ సినిమాని ఒప్పుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఈ మూవీకి అన్ని కష్టాలే. వందల కోట్ల బడ్జట్ పెట్టినా సరిగ్గా రాని విజువల్ ఎఫెక్ట్స్, ప్రభస్ లుక్ పైన నెగటివ్ కామెంట్స్, సైఫ్ అలీ ఖాన్ లుక్ పైన ట్రోల్లింగ్ ఇలా ఒకటేంటి ఆది పురుష్ విషయంలో ఎన్నో జరిగాయి. ప్రభాస్ అభిమానులు కూడా డిజప్పాయింట్ అయ్యి సోషల్ మీడియాలో కామెంట్స్ చెయ్యడంతో మేకర్స్ ఆది పురుష్ రిలీజ్ డేట్ ని వాయిదా వేసి రిపేర్లు చేసే పనిలో పడ్డారు. రిపేర్లు అయిపోతున్నాయు జూలై 16న మా సినిమాని విడుదల చేస్తున్నాం అని మేకర్స్ ఇటివలే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈసారి అయినా ఆదిపురుష్ చెప్పిన డేట్, క్వాలిటీ కంటెంట్ తో రిలీజ్ అవుతుందా అని ప్రభాస్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాకి కొత్త కష్టం వచ్చి పడింది. పాన్ వరల్డ్ అంత పెద్దగా ఉన్న ఆ కష్టం పేరు ‘ది ఫ్లాష్’. DC Comics నుంచి వస్తున్న ఈ మూవీపై హాలీవుడ్ సినీ అభిమానుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ది ఫ్లాష్ మూవీ డిస్నీకి మంచి కలెక్షన్స్ తెస్తుంది అనే హాప్ లో సూపర్ హీరో ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. త్వరలో ట్రైలర్ రిలీజ్ అవ్వనున్న ది ఫ్లాష్ మూవీని కూడా మేకర్స్ జూలై 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆది పురుష్ రిలీజ్ అయ్యే రోజునే ది ఫ్లాష్ కూడా రిలీజ్ అవుతుంది అంటే బాక్సాఫీస్ దగ్గర మంచి క్లాష్ చూసే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్ లో ది ఫ్లాష్ సినిమా కారణంగా ప్రభాస్ మూవీకి కష్టాలు తప్పేలా లేవు. ఇండియాలో కూడా ఆది పురుష్ సినిమాకి A సెంటర్స్ లో ది ఫ్లాష్ మూవీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఇండియాలో ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయ్యే సాహసం చెయ్యదు కాబట్టి ఈసారి ప్రభాస్ వార్ హాలీవుడ్ సినిమాతో జరగనుంది. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఈ హీరోయిన్ తన ఫ్రెండ్ భర్తనే లాగేసుకుందా?
దేశముదురు సినిమాతో యూత్ కి డ్రీం గర్ల్ అయ్యింది హన్సిక. తెలుగులో మంచి క్రేజ్ ఉండగానే తమిళ్ సినిమాల వైపు వెళ్లిపోయి అక్కడ స్టార్ హీరోయిన్ అయిన హన్సిక గతేడాది డిసెంబర్ 4న సోహెల్ ని పెళ్లి చేసుకుంది. స్నేహితుల నుంచి భార్య భర్తలుగా మారిన ఈ జంట ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. క్యూట్ గా ఉన్నారు అంటూ ప్రతి ఒక్కరూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే ఇటివలే సోహెల్ మొదటి పెళ్లి సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకి వచ్చాయి. ఇందులో హన్సిక, సోహెల్ మొదటి భార్యతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో హన్సిక, తన స్నేహుతురాలి భర్తనే లాగేసుకుంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఈ విమర్శలు తీవ్రస్థాయిలో రావడంతో హన్సిక రెస్పాండ్ అయ్యింది. ఆ సమయంలో సోహెల్ నాకు తెలుసు కాబట్టి అతని విడాకులకి నేను కారణం కాదు. దీనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను పబ్లిక్ ఫిగర్‌ని కాబట్టి, ప్రజలకి నన్ను విలన్ ని చేయడం చాలా సులభం. ఇది నేను సెలబ్రిటీగా ఉన్నందుకు చెల్లించే మూల్యం” అంటూ ఎమోషనల్ అయ్యింది. ఇదే విషయంపై సోహెల్ కూడా స్పందిస్తూ “నా మొదటి పెళ్లి, విడుకులు లాంటి విషయాలు రాంగ్ టైంలో బయటకి వచ్చాయి. నా ఫస్ట్ వైఫ్ తో విడిపోవడం అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దానితో హన్సికకి సంబంధం లేదు. తను నా ఫ్రెండ్ కాబట్టి ఆ సమయంలో నా పెళ్లికి వచ్చింది. అప్పుడు తీసిన ఫోటోలు బయటకి రావడంతో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి” అన్నాడు. మరి హన్సిక, సోహెల్ చెప్పిన మాటలు విన్న తర్వాత అయినా ఆ విమర్శలు ఆగుతాయేమో చూడాలి.