WPL Auction 2023: మహిళల ప్రీమియర్ లీగ్-2023 వేలం ముంబైలో జరిగింది. ఈ వేలంలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానను అదృష్టం వరించింది. ఆమెను 3.4 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్‌ను 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్ సొంతం…
India vs Australia Test: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలిటెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయింది. ఇన్నింగ్ 132 పరుగుల తేడాతో ఓడిపోవడాన్ని ఆస్ట్రేలియా మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఆసీస్ టీమ్ పై దారుణంగా విమర్శలు చేస్తోంది. ఈ ఓటమిని ‘అవమానకరమైన ఓటమి’గా అభివర్ణిస్తోంది. రెండో టెస్టుకు మార్పులతో బరిలోకి దిగాలని సూచించింది. స్పిన్ తో ఆసీస్ కు చుక్కలు చూపించిన అశ్విన్, రవీంద్ర జడేజాలపై ప్రశంసలు కురపిస్తోంది అక్కడి మీడియా.
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది.. ఈ సారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఆరోపించారు జేసీ.. అయితే, ఈ క్రమంలో ఇసుక…
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా.. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ నెల 17న ప్రారంభించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించిన ప్రభుత్వం. ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో ఆవిర్భావ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 27, 2019న కొత్త సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. నాలుగేళ్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఈ సచివాలయం రూ. 610 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు.…
పార్టీ మారుతున్నారంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదు.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు ఇకపై నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.. నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయి.. కానీ, నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ఇక, పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని తెలిపారు ఎమ్మెల్యే…
లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని…
లోకేష్ పాదయాత్ర… టీడీపీకి పాడే యాత్రే..! టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు రాస్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి.. ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర వెల వెల పోతుంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి యాత్ర గ్రాండ్ సక్సెస్…
తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యం ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ… 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా పట్టించుకోని ఏకైక ప్రభుత్వం మోడీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందని, అప్పుల విషయంలో…