ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లు.. అటు భారత్.. ఇటు పాకిస్తాన్ కాకుంటా విదేశాల్లో ఏసీసీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ వేదికగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఫోకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. టీడీపీ అభ్యర్థి విజయం మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్లోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పలేదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు.. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి.. అయితే, ఎమ్మెల్యే కోటాలోని ఏడు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు…
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన.. ప్రస్తుతానికి ఎత్తు అంతే..! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం.. పోలవరం నీటి నిల్వపై లోకసభలో సమాధానం ఇచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్.. పోలవరం ఎత్తు ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితం అని తేల్చిచెప్పారు.. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు స్పష్టం చేసింది కేంద్రం.. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకే…
ఏపీ రాజధాని అమరావతే.. సీఎం విశాఖకు పారిపోతున్నారు..! ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామని స్పష్టం చేశారు.. అయితే, విపక్షాలు మాత్రం.. అమరావతే రాజధాని అని చెబుతున్నాయి.. మరోసారి రాజధానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ రాజధాని అమరావతేనని స్పష్టం చేసిన ఆయన.. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం అని ప్రకటించారు.. అమరావతి రాజధాని అనే…
రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామడుగు మండలంలోని రైతులకు చెందిన పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించి సహాయానికి సంబంధించి అధికారులకు సూచనలు అందించనున్నారు. రామడుగు మండలంలోని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవల కురిసిన వడగళ్ల వానతో కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలంలోని ధర్మాజిపేట, చిప్పకుర్తి, లక్ష్మీ పూర్ గ్రామాల్లో…
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు పంజాయ్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో ఉన్న ఓ ఏనుగు.. క్రికెట్, ఫుట్ బాల్ ఆడుతోంది. సొంతంగానే స్నానం కూడా చేస్తోంది. 36 ఏళ్ల వయసులో చలాకీగా ఆటలు ఆడుతుంది ఈ గజరాజు.
విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. ఈ మ్యాచ్ జరగననున్న చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరీ..
వన్డే ప్రపంచకప్ 2023 మన భారత్ దేశంలోనే జరగనుంది. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. భారత్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ అక్డోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది.