వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటన శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఫాలో ఆన్ ఆడుతున్న లంకేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. పక్షిలా ఈజీగా గాల్లోకి ఎగురుతూ ఒంటిచేత్తో అందుకున్న ఈ డైవింగ్ క్యాచ్
అకాల వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి.. పంట నష్టంతో రైతులు నిండా మునిగారు.. చేతికొచ్చిన పంట వర్షార్పణం అయినట్టు అయ్యింది.. అయితే, రాష్ట్రంలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు.. సీఎంవో అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్కు అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే…
వారికి ఖాతాల్లో ఈ రోజే సొమ్ము జమ.. నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇక, ఈ సందర్భంగా విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెబుతూ.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును ఈ రోజు విడుదల చేయనున్నారు.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. జగనన్న విద్యా దీవెన…
విద్యార్థులకు శుభవార్త.. రేపే ఖాతాల్లోకి ఆ సొమ్ము.. విద్యార్ధులకు మరోసారి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివేందుకు ఉద్దేశించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి సొమ్మును రేపు అనగా.. ఈ నెల 19న విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే సభలో బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేయనున్నారు సీఎం జగన్.. ఈ రోజే విద్యా దీవెన నిధులు విడుదల చేయాల్సి…
సర్కార్ గుడ్న్యూస్.. ఆ పన్నులపై రాయితీ.. ఇంటి పన్ను, కుళాయి పన్ను చెల్లించేవారికి గుడ్న్యూస్ చెప్పారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రమేష్.. వడ్డీ లేకుండా పన్ను చెల్లింపునకు అవకాశం ఇచ్చినట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిలపై ప్రభుత్వం వడ్డీ రాయితీ ప్రకటించినట్టు తెలిపారు.. కోవిడ్ నేపథ్యంలో అపరాధ రుసుము చెల్లించలేక ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు బకాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎన్నో ఏళ్లుగా…