మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. అన్ని ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధం చేస్తున్నాయి. వరల్డ్ టీ20 ఛాంపియన్స్ గా అవతరించిన ఇంగ్లండ్ ప్లేయర్లు రానుండడంతో ఈసారి ఐపీఎల్ కు మరింత జోష్ వచ్చి చేరింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ రాక కోసం సీఎస్కే అభిమానులు వేచి చూశారు. ఈ నేపథ్యంలో స్టోక్స్ సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను ఐపీఎల్ కోసం వచ్చేస్తున్నానని బెన్ స్టోక్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా అంటూ చెన్నై, ఐపీఎల్ ను ట్యాగ్ చేశాడు. దీనికి కేవలం తన షూస్ మాత్రమే కనిపిస్తున్న ఫోటోను పోస్ట్ చేశాడు.
Also Read : Minister Ktr: వేరేవాళ్లను నమ్మితే వందేళ్లు వెనక్కే..
అయితే సీఎస్కే స్టోక్స ఎంట్రీకి సంబంధించిన వీడియోను ఇవాళ తన ట్విట్టర్ లో రీలిజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత వేలంలో బెన్ స్టోక్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఏకంగా రూ. 16.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానంగా స్టోక్స్ ను ఆ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. గత సీజన్ లో చెన్నై దారుణమైన ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి బెన్ స్టోక్స్, ధోని కలిస్తే మళ్లీ సీఎస్కే టీమ్ మునుపటి మ్యాజీక్ చేస్తుందని చెన్నై అభిమానులు ఆశతో ఉన్నారు.
Also Read : VNR Trio: చిరు గెస్టుగా నితిన్, రష్మిక క్రేజీ మూవీ లాంచ్ అయ్యింది
అయితే స్టోక్స్ ఐపీఎల్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడా లేదా అనేది చెప్పడం మాత్రం కష్టమే.. సంప్రదాయ క్రికెట్ కు ఎక్కువ విలువనిచ్చే బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్ పై కన్నేశాడు. దీనికి తోడు అతడు మోకాలి గాయంతోనూ బాధపడుతున్నాడు. అయినా సరే తాను మాత్రం సీఎస్కేకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ మార్చ్ 31న గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది.
Ungal NanBEN in Namma Area! 🥳#WhistlePodu #Yellove 💛🦁@benstokes38 pic.twitter.com/5CC0YYSiKm
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2023