MS Dhoni : బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మిస్టర్ కూల్.. ఈసారి కప్పు ముఖ్యం బిగిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరో వారం రోజుల్లో ఐపీఎల్ 2023 కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్లేయర్స్.. ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశారు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ చూసిన ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఎందుకంటే అతను ఈ సారి ప్రాక్టీస్ సెషల్ లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో అతను ఈ సీజన్ లో బౌలింగ్ కూడా చేయబోతున్నాడా అనే అనుమానం ఫ్యాన్స్ కు కలుగుతుంది. మరి ఈ సీజన్ లో అతుడు ఏం అద్బుతం చేయబోతున్నాడో అంటూ ధోనీ అభిమానులు అనుకుంటున్నారు. చెపాక్ స్టేడియంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎంఎస్ ధోనీ అలరిస్తున్నాడు.
Also Read : Tulasi In Milk : తులసి ఆకుల పాలు తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరుగుతాయి
Also Read
- Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
- Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే ఫ్రాంఛైజీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. వాస్తవానికి మహీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటాడు. ఇది క్రికెట్ అభిమానులందరికి తెలుసు.. కానీ అతను బంతిని కూడా గింగిరాలు తిప్పుతూ బౌలింగ్ చేయడం అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. అందుకు సంబంధించిన వీడియో ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక బౌలింగ్ వీడియో చూసిన అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ పట్ల తనకున్న నిబద్దతను, కస్టపడేతత్వాన్ని ప్రతిబింబిస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని మరికొందరు అభిమానులు భావిస్తున్నారు. ఈ వీడియోపై సీఎస్కే మాజీ ప్లేయర్ షేన్ వాట్సన్ కూడా స్పందించాడు. మహీ చాలా ఫిట్ గా ఉన్నాడని.. అతడు మరో నాలుగేళ్ల వరకు అభిమానులను అలరించగలడని అభిప్రయపడ్డాడు.
Also Read : CCL2023 : దంచికొట్టిన తమన్.. ఫైనల్ కు తెలుగు వారియర్స్..
కాగా, ఎస్కే ఇప్పటికే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. ఈ సారి కూడా ఎలాగైనా టైటిల్ నెగ్గాలనే పట్టుదలతో ఉంది. దీనికోసం ఆక్షన్ లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. గత సీజన్ లో అందుబాటులో లేని దీపక్ చాహర్ ను తిరిగి దక్కించుకుంది. అలానే గాయం కారణంగా గత సీజన్ లో కొన్ని మ్యాచ్ లకు దూరమైన రవీంద్ర జడేజా కూడా ఈ సీజన్ లో ఆడనున్నాడు. మొత్తంగా టాలెంట్ ప్లేయర్స్ తో బలంగా ఉన్న ఈ జట్టుపై అభిమానులు కూడా అంచనాలను ఎక్కువగానే పెట్టుకున్నారు. ఈ సారి ఎలాగైనా అభిమాన జట్టు ట్రోఫీని ముద్దాలని ఆశిస్తున్నారు. ఈ ఐపీఎల్.. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ తో ప్రారంభంకానుంది. ఈ నెల 31న ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభంకానుంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!