Rohit Sharma : వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లొద్దా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధోనీ టీమిండియా సారథిగా ఉన్నప్పుడు మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన భారత జట్టు, ఆ తర్వాత ఒక్క ఐసీసీ టైటిల్ గెలవడానికి తెగ కష్టపడుతోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నా.. డెడికేషన్ కూడా ఓ కారణమే.. వరల్డ్ కప్ కోసం అప్పుడే పుట్టిన తన కూతురిని చూసుకునేందుకు నెల రోజులు వెయిట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత అంత డెడికేషన్ పెట్టిన కెప్టెన్ టీమిండియాకి దొరకలేదు.. ఆడిలైడ్ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత టీమ్ ని వదిలేసి పెటర్నిటీ లీవ్ ద్వారా స్వేదేశానికి విరాట్ కోహ్లీ వెళ్లిపోయాడు. ఇక రోహిత్ శర్మ అయితే టీమిండియా మ్యాచ్ ల కంటే బామ్మర్ది పెళ్లికి వెళ్లడానికే ప్రాధాన్యం ఇచ్చాడు.
Also Read : Supreme Court: కేంద్ర సంస్థల దుర్వినియోగంపై సుప్రీంకోర్టుకు 14 ప్రతిపక్ష పార్టీలు..
Also Read
ఓ వైపు టీమిండియా, ఆస్ట్రేలియాతో మొదటి వన్డే ఆడుతుంటే రోహిత్ శర్మ, తన బామ్మర్ది పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. భారత జట్టు కెప్టెన్ అయ్యుండి.. ఇలా చిన్న చిన్న విషయాల కోసం సెలవులు తీసుకోవాడాన్ని తీవ్రంగా జనాలు తప్పుబట్టారు. టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా రోహిత్ శర్మపై ఫైర్ అయ్యాడు. కెప్టెన్ అయ్యుండి.. అతను ఇలా మాటిమాటికి సెలవులు తీసుకోవడం ఏం బాగోలేదు.. అంటూ సునీల్ గవాస్కర్ అన్నారు. రోహిత్ శర్మ ఇకనైనా ప్రతీ మ్యాచ్ ఆడాలి.. వరల్డ్ కప్ కి ఎంతో టైంలేదు.. ఇకనైనా టీమ్ కాంబినేషన్ పైన దృస్టి పెట్టాలన్నారు.
Also Read : Viral: కోడలా మజాకా.. పెళ్లికి ముందే ఇలా వుంటే పెళ్లైతే..
టీమ్ లో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు.. హార్థిక్ పాండ్యా.. టీ20 కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.. రోహిత్ శర్మ వన్డే టెస్టుల్లో కెప్టెన్ గా ఉన్నాడు.. అని సునీల్ గవాస్కర్ అన్నారు. రోహిత్ ఇలా మాటిమాటికి రెస్ట్ తీసుకుంటూ పోతే హార్దిక్ పాండ్యాకి వన్డే క్యాప్టెన్సీ ఇచ్చేస్తే మంచిదన్నాడు. టీమ్ కాంబినేషన్ పై కెప్టెన్ కు పూర్లి క్లారిటీ ఉండాలి.. అలా రావాలంటే ప్రతీ మ్యాచ్ ఆడాలి.. అంటూ సునీల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : Traffic challan: బైక్ ఒకరిది.. ట్రాఫిక్ చలానా మరొకరికి..
వరల్డ్ కప్ ఉంటే.. బామ్మర్ది పెళ్లికి వెళ్లకూడదా.. ప్రతీ ఒక్కరికీ కుటుంబ బాధ్యతులు కూడా ఉంటాయని రోహిత్ శర్మ కౌంటర్ ఇచ్చాడు. కుటుంబం కంటే ఏమీ ముఖ్యం కాదు.. వరల్డ్ కప్ కి ముందు అన్ని పనులు పూర్తి చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని రోహిత్ అన్నాడు. ఎనర్జీని కాపాడుకుంటూ ఏ పని చేసినా తప్పులేదు. కెప్టెన్ గా వరుసగా మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి సెలవుల వల్ల చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతామని రోహిత్ శర్మ అన్నాడు. కొత్త ఎనర్జీ పుడుతుంది.. అది చాలా స్పెసల్ అంటూ టీమండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ చేశాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?