ఆసియాకప్-2023 నిర్వహణ వివాదం ఇంక సద్దుమణగలేదు.. ఈ ఏడాది ఆసియ్ కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్-పాక్ ల మధ్య కొలకొన్ని ఉద్రిక్తతల దృష్ట్యా.. దాయాది దేశంలో పర్యటించేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు.. కొద్ది రోజల క్రితం ఆసియా కప్ ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు సూచించిన బీసీసీఐ.. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లు.. అటు భారత్.. ఇటు పాకిస్తాన్ కాకుంటా విదేశాల్లో ఏసీసీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఏఈ వేదికగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : SSC Exam Hall Tickets: నేటి నుంచి వెబ్‌సైట్‌లో ‘పదోతరగతి’ హాల్‌టికెట్లు
ఇటీవలే ఈ వివాదంపై పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యల చేశాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశాడు.. అదే విధంగా ఈ విషయంపై భారత ప్రధాని నరేంద్రమోడీతో తాను త్వరలోనే మాట్లాడుతానని చెప్పారు. భారత్-పాక్ ల మధ్య సంబంధాలు పెరగాలంటే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలని ఆఫ్రిది అన్నారు. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోడీ సార్ నను అడుగుతానని స్పష్టం చేశాడు. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలకున్నా.. వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము.. బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. కానీ మనం పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు.. బాధ్యత కూడా తీసుకోవాలని షాహిద్ ఆఫ్రిది అన్నారు. మీరు శత్రువులను తగ్గించుకుని.. స్నేహితులను పెంచుకోవాలి తప్ప.. శత్రువులను కాదు అని అన్నాడు.
Also Read : E-Commerce : ఈ కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా కేంద్రం అడుగులు
సెప్టెంబర్ ఫస్ట వీక్ లో 50 ఓవర్ల ఫార్మాట్ లో ఈ సంవత్సరం ఆసియా కప్ జరుగనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్ లో చోటు దక్కిచుకున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ లు రెండో గ్రూప్ లో ఉన్నాయి. ఫైనల్ తో కలిపి 13 రోజుల్లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. 2022 ఆసియా కప్ ఫార్మాట్ ప్రకారం.. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4 చేరుకుని ఫైనల్ లో పోటీపడతాయి. అయితే టోర్నీ మొత్తంలో భారత్, పాకిస్థాన్ లు మూడు సార్లు తలపడే అవకాశం ఉంది.