భారత్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకుంది. అప్పటి వరకూ నెంబర్ వన్ జట్టుగా ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. చెన్నై వన్డేలో గెలిచిన ఆసీస్ ఖాతాలో 113.286 రేటింగ్ పాయింట్లు చేరగా.. భారత్ ఖాతాలో 112.638 పాయింట్లు ఉన్నాయి. చివరి వన్డే ప్రారంభానికి ముందు భారత్ 114 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో ఉండేది, ఆస్ట్రేలియా ఖాతాలో 112 పాయింట్లు ఉండేవి.
Also Read : Manchu Family: రోడ్డునపడ్డ ఇంటి గుట్టు… మంచు మనోజ్ అనుచరుడిపై మంచు విష్ణు దాడి
మరోవైపు టెస్టుల్లోనూ ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించినప్పటికీ.. తొలి స్థానాన్ని పదిలం చేసుకోలేకపోయింది. వరుసగా టీమిండియా.. ఇండోర్ టెస్టులో అనూహ్య రీతిలో ఓడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ టెస్టుల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డ మీద నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడింది.
Also Read : TSPSC Remand Report: TSPSC పేపర్ లీకేజ్ కేసు.. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు
ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఆడిన తొలి రెండు టెస్టుల్లో ఓడిన ఆసీస్.. తర్వాత స్మిత్ నాయకత్వంలో చివరి రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్ లో తలపడింది. స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఒక వన్టేలో మాత్రమే ఓడింది. చివరి వన్డేలోనూ భారత్ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. స్మిత్ అద్భుత కెప్టెన్సీతో భారత్ కు విజయం దూరమైంది. చివరి వన్డేలో భారత్ బ్యాటింగ్ చేసిన తీరు.. భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అసలే ఈ ఏడాది చివర్ లో వన్డే వరల్డ్ కప్ జరుగునుండటంతో.. టీమిండియా ఆటగాళ్ల ఆటతీరు కలవరానికి గురి చేస్తోంది.