భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ కు దూరమైన స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా గ్రాండ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు కీలక మ్యాచ్ ల్లో భారత్ బౌలింగ్ కొద్దిగా పేలవంగా ఉంది. అయితే ఇప్పుడు బుమ్రా రీ ఎంట్రీ అనడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. ఆగస్టు 31న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 టోర్నీని సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నట్లు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పేర్కొంది.