ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. చైనాలో జరగనున్న ఈ గేమ్స్‌లో క్రికెట్‌ను కూడా చూడనున్నారు. ఈ క్రీడల్లో భారత పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయి. ఆసియా క్రీడలకు తమ పురుషుల, మహిళల జట్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ముందుగా బోర్డు సిద్ధంగా లేకపోయినా ఇప్పుడు అంగీకరించడంతో.. ఆసియా క్రీడల్లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనుంది. అయితే ఈ గేమ్‌లలో భారత మహిళల జట్టు ఆడనుంది. మరోవైపు ఇండియాలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ప్రధాన…
భారత బౌలర్ నవదీప్ సైనీ వెస్టిండీస్ టూర్ లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనకు తనను సెలెక్ట్ చేయడంపై షైనీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పటికే కౌంటీ క్రికెట్ ఆడేందుకు నవదీప్ సైనీ ఇంగ్లండ్ చేరుకోగా.. అతను వోర్సెస్టర్‌షైర్ తరపున కౌంటీ ఆడనున్నాడు.
వైటాలిటీ బ్లాస్ట్ లో సోమర్సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్ వేసేటప్పుడు అతని వేలికి గాయమైంది. బాలు వేసిన వెంటనే అతనివైపు రావడంతో.. దాన్ని ఆపే క్రమంలో బంతి అతని వేలికి తాకుతుంది. వెంటనే మెర్వ్ నొప్పితో గంతులేస్తాడు. అంతేకాకుండా అతని వేలు మెలితిరిగి పోయింది. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి వేలు లాగుతాడు. అయినప్పటికీ.. మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు.