వారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 294 మందికి ఉద్యోగావకాశం!
ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న అయిన వారిని దూరం చేసుకున్న వారికి సంస్థ శుభవార్త చెప్పింది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐపిఎస్ కారుణ్య నియామకాలు భర్తీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఔదార్యంతో 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అలా మొత్తం 294 మందికి ఉద్యోగావకాశం కల్పించనుంది ఏపీఎస్ ఆర్టీసీ. ఇక ఈ కారుణ్య నియామకాలతో ౩4 మంది జూనియర్ అసిస్టెంట్లు, 99 మంది ఆర్టీసీ కానిస్టేబుల్స్, 99 మంది అసిస్టెంట్ మెకానిక్ లు, 61 మంది కండక్టర్లు , ఒక డ్రైవర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక ఏపీఎస్ఆర్టీసీ విధ్యాధరపురం ట్రాన్స్ పోర్ట్ అకాడమీలో ఈ రోజు ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఇక ఈ శిక్షణా తరగతులు ప్రారంభోత్సవానికి సంస్థ ఎం.డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని సూచనలు చేశారు. 3 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కే.ఎస్. బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. శిక్షణా కాలంలో ఉద్యోగులకు స్టైఫండ్ ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. ఇక వస్తాయో? రావో? వస్తే ఎప్పుడు వస్తాయి? అని తెలియక ఇబ్బందులు పడుతున్న చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఈ సందర్భంగా ఆనందం వెల్లివిరిసింది.
హైదరాబాద్‌ను తాకిన రుతుపవనాలు.. నగరంలో పలుచోట్ల వర్షం..
హైదరాబాద్‌ను రుతుపవనాలు పలకరించాయి. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టినా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలుచోట్ల వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, లక్డీ కపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట, ఈఎస్ఐ, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. మరోవైపు వర్షం దాటికి నగరంలో రోడ్లన్ని జలమయం కాగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు వచ్చే సమయం కావడంతో.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర వ్యాప్తంగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. ఇన్ని రోజులు ఎండ వేడికి ఉక్కిరి బిక్కిరి అయిన నగర వాసులు.. ఈ వర్షంతో కాస్త కూల్ అయ్యారు.
యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీ.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
యోగా ప్రతీఒక్కరికి అవసరం.. ప్రపంచాన్ని యోగా ఏకం చేస్తుందన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. యోగా అనేది ఏ ఒక్క దేశానికో.. ఏ ఒక్క మతానికి లేదా జాతికి చెందినది కాదని వ్యాఖ్యానించారు.. తొమ్మిదో వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన యోగా సెషన్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. యోగాకు కాపీరైట్, పేటెంట్, రాయల్టీల వంటివి లేవని.. భారత్‌లో పుట్టిన ప్రాచీన సంప్రదాయమన్నారు.. యోగా అంటే ఐకమత్యం, అందుకే అందరూ కలిసి వచ్చారని తెలిపారు ప్రధాని మోడీ. యోగా డే సెషన్‌లో 180 కంటే ఎక్కువ దేశాల నుండి హాజరైన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి యూఎన్ అధికారులు, దౌత్యవేత్తలు మరియు ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికి, మతానికి లేదా జాతికి చెందినది కాదని, తొమ్మిదో వార్షిక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అపూర్వమైన యోగా సెషన్‌కు నాయకత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.. యోగా కాపీరైట్‌లు, పేటెంట్లు మరియు రాయల్టీ చెల్లింపుల నుండి ఉచితం.. యోగా మీ వయస్సు, లింగం మరియు ఫిట్‌నెస్ స్థాయికి అనుగుణంగా ఉంటుంది. యోగా పోర్టబుల్ అని పీఎం అన్నారు.
సంపూర్ణ మద్యపాన నిషేధంవైపు అడుగులు.. రేపటి నుంచి 500 మద్యం షాపులు మూత..
మద్యం ప్రియులు క్రమంగా పెరిగిపోతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.. అయితే, రాష్ట్రాలను బట్టి పరిస్థితులు వేరుగా ఉన్నాయి.. తమిళనాడు సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ (TASMAC) ఆధ్వర్యంలో నిర్వహించే 500 లిక్కర్ షాపులను మూసి వేస్తున్నట్టు.. తమిళనాడు ప్రభుత్వ రిటైలర్ టాస్మాక్ ప్రకటిచింది.. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా.. తొలి విడతలో స్కూళ్లు, టెంపుల్స్ సమీపంలో ఉన్న మద్యం షాపులను మూసివేస్తున్నట్టు పేర్కొంది.. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చింది.. ఇక, డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానంలో కీలక మార్పులు చేసింది.. ఇప్పుడు 500 మద్యం రిటైల్ షాపులను జూన్ 22 నుండి మూసివేస్తామని, వాటి మూసివేతకు గతంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) అమలులోకి వస్తుందని రాష్ట్ర-రక్షణ మద్యం రిటైలర్ (TASMAC) బుధవారం తెలిపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొన్ని నెలల కిందట ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది.. ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఏప్రిల్‌లోనే మద్యం దుకాణాల మూసివేతపై ప్రకటన చేశారు.
సెంచరీ చేసి కోహ్లీకి సవాల్ విసిరిన పాకిస్తాన్ క్రికెటర్..!
హరారేలో జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మ్యాచ్ లు అద్భుతంగా ఆడుతున్నారు. అమెరికా, నేపాల్, ఒమన్, జింబాబ్వే, యూఏఈ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చూపిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం అమెరికా బ్యాట్స్‌మెన్ షాయన్ జహంగీర్ తన సత్తా చూపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నేపాల్‌పై కేవలం 79 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీకి సవాల్ విసిరాడు. మ్యాచ్ అనంతరం ఐసీసీతో జరిగిన ఇంటర్వ్యూలో జహంగీర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో ఒక రోజు ఆడటం తన ఏకైక లక్ష్యమన్నారు. ప్రతి లీగ్‌లో రాణించగల తనలాగే తాను కూడా మంచి బ్యాట్స్‌మెన్ అని కోహ్లీకి చూపించాలనుకుంటున్నా అన్నట్లు తెలిపాడు. నేపాల్‌పై జహంగీర్ అద్భుతమైన సెంచరీ సాధించాడని దయచేసి చెప్పండి. అతను ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగి.. సెంచరీ చేయడం ప్రత్యేకం. జహంగీర్ క్రీజులో అడుగు పెట్టినప్పుడు, జట్టులోని ఐదు వికెట్లు పడిపోయాయి. దీని తర్వాత, జహంగీర్ వేగంగా షాట్లు ఆడాడు మరియు 10 ఫోర్లు మరియు 3 సిక్సర్ల సహాయంతో అతను అద్భుతమైన సెంచరీని సాధించాడు. అని ఇన్ స్టాగ్రామ్ లో తన వీడియోను షేర్ చేశాడు.
అత్త చేతిలో ఎంఎస్ ధోని వ్యాపారం..! వందల కోట్ల విలువైన సంస్థకు ఆమె సీఈవో..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి తెలియనివారుండరు.. భారత జట్టును విజయపథంలో నడిపి.. క్లిష్ట సమయంలోనూ జట్టుకు విజయాలను అందించి మిస్టర్ కూల్‌గా పేరు తెచ్చుకున్నారు.. అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పినా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు.. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐదోసారి చాంపియన్‌గా నిలిపి.. అసలు ధోనీ లేకుండా ఐపీఎల్ లేదా? అనేలా అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఓవైపు క్రికెట్ మరోవైపు వ్యాపారం.. కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్.. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్నారు జార్ఖండ్ డైనమైట్.. అయితే, మన మహేంద్రుడి వ్యాపార సామ్రాజ్యం మొత్తం తనకు పిల్లను ఇచ్చిన అత్త చేతిలో పెట్టారట ధోనీ.. విషయం ఏంటంటే.. ఓవైపు సంపాదిస్తూనే మరోవైపు.. పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టారు ధోనీ.. వినోద రంగంలోనూ ఎంట్రీ ఇచ్చారు.. ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరిట ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. అయితే, ఆ సంస్థ బాధ్యతలు మొత్తం తనకు పిల్లనిచ్చిన అత్త చేతిలో పెట్టారు.. ఆ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మిస్టర్ కూల్ యొక్క అత్త షీలా సింగ్ అట! ఓ నివేదిక ప్రకారం.. తన ప్రొడక్షన్ హౌజ్‌లో కుటుంబ సభ్యులకు పెద్దపీట వేయాలని భావించిన ధోనీ.. భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు బాధ్యతలు అప్పగించాడు. కాగా, సౌత్‌లో తన బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మిస్తున్న ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి అతిపెద్ద షేర్ హోల్డర్ అని సమాచారం.
గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఆగస్టు 15 వరకు అవకాశం..
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ‘అమృత్ కలాష్’ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని పొడిగించింది. ఎస్బీఐ వెబ్‌సైట్ ప్రకారం, ఈ 400 రోజుల టర్మ్ డిపాజిట్ సాధారణ కస్టమర్‌లకు 7.1 శాతం మరియు సీనియర్ సిటిజన్‌లకు 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ 400 రోజుల స్పెషల్ డిపాజిట్ పథకమైన అమృత్ కలాష్ డిపాజిట్ పథకం గడువు ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల అంటే జూన్ 30వ తేదీతో ముగియాల్సి ఉంది.. అయితే ఖాతాదారుల్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ స్కీమ్‌ను ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. ఏప్రిల్ 2023లో ప్రవేశపెట్టిన తర్వాత ఈ పథకం జూన్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుందని ప్రకటించారు.. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌తో డబ్బులు దాచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది.. కానీ, ఎస్బీఐ అమృత్ కలాష్‌లో అదనపు వడ్డీ పొందే అవకాశం ఉంది.. ఎస్బీఐ అమృత్ కలాష్ ఎఫ్‌డీ పథకంలో డిపాజిట్ చేయాలంటే ఎస్బీఐ బ్రాంచ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్బీఐ YONO యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
‘ది కానిస్టేబుల్’ షూటింగ్ లో హీరో వరుణ్ సందేశ్ కు గాయాలు
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ కుర్ర హీరో.. ఆ తరువాత ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోలేకపోయాడు. ఇక గతేడాది బిగ్ బాస్ లోకి భార్యతో కలిసి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను అలరించి బయటికి వచ్చాడు. ఇక బిగ్ బాస్ తరువాత వరుణ్ రీ ఎంట్రీ హిట్ కోసం చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇందువదన అనే బోల్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని కసిమీద ఉన్న ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఆర్యన్ శుభాన్ SK దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ సందేశ్ కు గాయాలు అయ్యినట్లు చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ తెలిపాడు. “నిన్న చిత్రానికి సంబంధించిన ఫైటింగ్ సీన్ షూటింగ్ సమయంలో హీరో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. డాక్టర్లు వరుణ్ ని మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా చెప్పారు. దాంతో కానిస్టేబుల్ సినిమా షూటింగ్ అద్దాంతంగా వాయిదా వేయాల్సివచ్చింది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది” అని చెప్పుకొచ్చాడు. ఇక నిర్మాత మాట్లాడుతూ.. ” పల్లెటూరి వాతావరణం లో నిర్మాణం అవుతున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని 40% పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని” అన్నాడు. ఈ వార్త తెలియడంతో వరుణ్ సందేశ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆ కుర్ర రచయిత సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే?
బెజవాడ ప్రసన్న కుమార్ “నేను లోకల్”, “ధమాకా” వంటి విజయవంతమైన సినిమాలకు కధ అందించి మంచి ఫేం తెచ్చుకున్నాడు. ఈరోజు తెలుగు సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న రచయితల్లో ఆయన కూడా ఒకరంటే అతిశయోక్తి కాదు. ఆయన ముందు నుంచి ప్రధానంగా దర్శకుడు నక్కిన త్రినాధరావు సినిమాలకు స్క్రిప్ట్‌లు అందిస్తూ సంభాషణలను కూడా అభివృద్ధి చేస్తూ ఉండేవాడు. అయితే ఎన్నాళ్ళు ఇలా రైటర్ గా ఉంటాను, ఇకనైనా డైరక్టర్ గా మారాలి అనుకుని నాగార్జున అక్కినేనికి మంచి కథ చెప్పాడు. ఆది బాగా నచ్చడంతో నాగ ఆయనకు డైరెక్షన్ చేసే అవకాశాన్ని ఇచ్చాడు. నిజానికి నాగార్జున ప్రసన్నకుమార్ కథనంతో చాలా థ్రిల్ అయ్యాడట, ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాసినందుకు అభినందించాడు కూడా. అయితే బెజవాడ ప్రసన్న కుమార్ ఒక మలయాళ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే వార్తను నాగార్జున చదివిన కొద్ది రోజుల తర్వాతే అసలు సమస్య మొదలైంది. ఈ వార్త నిజమేనా అని ప్రసన్నను అడిగితే, దానికి రచయిత తాను మలయాళ చిత్రం పొరింజు మరియం జోస్ (2019) నుండి నాలుగు సన్నివేశాలను తీసుకున్నానని బదులిచ్చాడట. మలయాళ సినిమా నుంచి కేవలం నాలుగు సన్నివేశాలు మాత్రమే తనని ఇన్స్ పైర్ చేశాయని, ప్రధాన కథ తన స్వంత సృష్టి అని ప్రసన్న కుమార్ నాగార్జునతో చెప్పినట్లు తెలిసింది.
వరుణ్ లావణ్య పెళ్లి అప్పుడేనా?
మెగా కుటుంబం లో వరుస గుడ్ న్యూస్ లను వింటున్నారు.. మెగా కోడలు ఉపాసన కడుపుతో ఉన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలిలో గుడ్ న్యూస్ లు వింటున్నాము.. ఇక రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాగే రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. అలాగే చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో జంటగా నటించారు. అంతే కాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కూడా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఫిక్స్ అయింది.. ఇలా వరుస మెగా ఫ్యాన్స్ గుడ్ న్యూస్ లను వింటున్నారు.. ప్రస్తుతం మెగా రామ్ చరణ్ దంపతులకు పాప పుట్టింది.. సినీ ప్రముఖులు , అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య ల ఎంగేజ్మెంట్ ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే..ఇక పెళ్లి డేట్ కూడా త్వరలోనే ఉంటుంది అని వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే పెళ్లికి సంబంధించిన షాపింగ్ మొత్తం పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ విదేశాల లో షాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆ మధ్య వీరిద్దరి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే..