కేసీఆర్ ఓసారి అచ్యుతాపురం రండి.. ఎకరా రేటు ఎంతో తెలుస్తుంది..
ఇప్పటికే ఓసారి తెలంగాణలో, ఏపీలో భూముల ధరలపై హాట్ కామెంట్లు చేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్.. ఈ వ్యవహారంలో మరోసారి స్పందించారు.. ఒకసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అచ్యుతాపురం వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందన్నారు.. ఏపీలో భూముల విలువలు తగ్గాయని చంద్రబాబు, కేసీఆర్‌కు చెప్పరంటా అని ఎద్దేవా చేసిన ఆయన.. ఒకసారి అచ్యుతాపురం కేసీఆర్ వస్తే ఎకరా రేటు ఎంత ఉందో తెలుస్తుందని సూచించారు.. అచ్యుతాపురంలో ఎకరా అమ్మితే తెలంగాణలో 150 ఎకరాల కొనవచ్చని చెబుతూ కేసీఆర్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు.. ఇక, గడప గడపకు వెళ్లకపోతే ఎమ్మెలే సీట్లు ఉండవని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.. అంత దైర్యంగా చెప్పిన నేత మరొకరు లేరన్నారు అమర్నాథ్.. టీడీపీ నేతల భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు.. వారు ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారెంటీ ఇస్తారు? అని ప్రశ్నించారు. కేజీ బంగారం, బెంజ్ కారు అంటూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తారు.. సీఎం విజయాన్ని అడ్డుకునే సత్తా చంద్రబాబు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్‌కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
పవన్ ఒకప్పుడు చాలా మంచి వాడు.. మాయలో ఎందుకు పడ్డాడో..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ కామెంట్లపై ఘాటుగా స్పందించారు.. పవన్ కల్యాణ్ కాపుల మధ్య నిలబడి కాపులను తిడుతున్నారంటే.. చంద్రబాబు ఎంత పెద్ద స్కెచ్ వేశారో అర్థం అవుతుందన్నారు.. నేను కాపు కాకపోయినా.. ముద్రగడ లాంటి వారిని గౌరవిస్తా. కాపుల కోసం ముద్రగడ ఆస్తిని, పదవులను కోల్పోయారు. కాపులకు అన్యాయం జరుగుతుందని.. తన మంత్రి పదవికి ముద్రగడ రాజీనామా చేశారు.. ముద్రగడ గొప్పవాడా.. పవన్ కల్యాణ్ ప్రేమించే చంద్రబాబు గొప్పవాడో కాపు సోదరులు గ్రహించాలని సూచించారు.. కాపులలో ఒకరు ముఖ్యమంత్రి కావాలని కాపులు కోరుకుంటుంన్నా.. పవన్ లాంటి వాళ్ల వల్ల నష్టపోతున్నారన్న ఆయన.. ముద్రగడ ఒక్క అవినీతి చేశాడని నిరూపించినా.. నేను రాష్ట్రం విడిచి వెల్లిపోతానంటూ సవాల్ చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని పవన్ కల్యాణ్ అనుకోవడాన్ని నేను తప్పపట్టడం లేదు.. కానీ, వంగవీటి మోహన్ రంగా లాంటి వారిని చంద్రబాబు చంపించారు.. ఇది అంత ఈజీగా మర్చిపోతారా..? అని ప్రశ్నించారు పోసాని.. నేను ఓడినా పర్వాలేదు.. కానీ, చంద్రబాబుతో కలవను అని చిరంజీవి అన్నారు.. ఇది చిరంజీవి నిజాయితీ. చిరంజీవి ఓడిపోవాలని కమ్మ కులస్తుల ఓట్లు ప్రజారాజ్యంకు వేయొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు.. ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో తెలియని పవన్.. కాపులను తిట్టడం వెనక ఉన్న ఎజెండా ఏంటి? అంటూ నిలదీశారు. కమ్మ అయినా.. నాకే కాపులు అంటే ఇష్టం.. అలాంటిది కాపు అయిన పవన్ మరో కాపును తిట్టడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ ను గత ఎన్నికల ముందు తిట్టిన ఇదే పవన్.. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు.. కాపు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాల్సిన పవన్.. కమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.
నిరుద్యోగులకు మరో శుభవార్త.. 1,827 కొత్త పోస్టులు
నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. 1,827 స్టాఫ్ నర్స్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పటికే వివిధ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్న ప్రభుత్వం.. వైద్య ఆరోగ్యశాఖపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిందనే చెప్పాలి.. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన భర్తీ చేయనున్నది. రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు తెలిపారు.. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందని.. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువ అవుతున్నదన్నారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నదన్నారు. ఇప్పటికే 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారిని టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించుకోగా, ప్రస్తుతం 1827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసుకోబోతున్నామన్నారు. దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. 1,827 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందన్నారు మంత్రి హరీష్‌రావు.. కాగా, కరోనా తర్వాత.. వైద్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.
ఫేస్‌బుక్ లైవ్ పెట్టి.. ఉరేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఫేస్‌బుక్ లైవ్ పెట్టి మరీ ఉరేసుకుని చనిపోయింది. సనా అనే మహిళ.. హేమంత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే తన అత్తమామలు ఆమెను తరచూ వేధించడం మొదలు పెట్టారు. అది చాలదన్నట్టు భర్త హేమంత్ సైతం మరో అమ్మాయికి దగ్గరయ్యాడు. సనా ముస్లిం కాగా ఆమె భర్త హిందువు. హేమంత్ తన కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని మతం మారి సనాను పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది మరి సనా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? హేమంత్‌కి వేరొకరితో ఉన్న అనుబంధమే సమాధానం. ఈ విషయం హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చెబుతున్నారు. సనాకు మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. సనా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హేమంత్ నాలుగేళ్ల క్రితం తమ ఇంటికి వచ్చాడు. తాను ముస్లింగా మారి సనాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు. అతను తన పేరును కూడా హేమంత్ నుండి షంషేర్ గా మార్చుకున్నాడు. కుటుంబం సభ్యులు చెప్పిన ప్రకారం ఓ ఏడాది పాటు అంతా బాగానే ఉంది. కానీ 5 నెలల నుంచి వేధింపులు భరించి భరించి విసుగు చెందిన సన ఫేస్‌బుక్‌లో లైవ్ వీడియో పెట్టి తన బాధనంతా వివరించింది. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై 7 శాతం వడ్డీ ఇస్తున్నాయి.. అవేంటో చూద్దాం
చాలా మంది ప్రజలు డబ్బు ఆదా చేయడానికి పొదుపు ఖాతాపై ఆధారపడతారు. ఇతర పెట్టుబడి ఎంపికలతో పోలిస్తే సాపేక్షంగా తక్కువ రాబడి ఉన్నప్పటికీ, సేవింగ్స్ ఖాతాలు వినియోగదారులకు అందించే సౌలభ్యం, వివిధ ప్రయోజనాల కారణంగా ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అయితే, పొదుపు ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఖాతాలపై 7శాతం వరకు వడ్డీని ఇస్తున్న ఆరు బ్యాంకుల గురించి తెలుసుకుందాం. పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ బ్యాంక్. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు పొదుపు ఖాతాలపై 7శాతం వడ్డీ రేటును అందిస్తోంది. మీరు మంచి వడ్డీ రాబడి కోసం చూస్తున్నట్లయితే, ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరిగణించవచ్చు. రూ.5 లక్షల వరకు బ్యాలెన్స్‌లపై 4శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, రూ.15 లక్షల కంటే ఎక్కువ నిల్వలపై 6.5శాతం ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టైర్డ్ పొదుపు చేసేవారికి మంచి వడ్డీ రేటును అందిస్తోంది. రూ. 1 లక్ష వరకు బ్యాలెన్స్‌లపై 3.5శాతం, రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్‌లపై 5.25శాతం, రూ. 5 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌లపై 7శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
మోడరన్ క్లాసిక్ వస్తుంది… నీ గ్యాంగ్ ని తీసుకోని థియేటర్స్ కి రా
మోడరన్ క్లాసిక్ అనగానే యూత్ అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే, దర్శకుడు తరుణ్ భాస్కర్ మాత్రం ఈ నగరానికి ఏమైంది సినిమా సీక్వెల్ ని హోల్డ్ చేసి ‘కీడా కోలా’ అనే సినిమా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు. తాగుదాం, గోవా పోదాం అనే సింగల్ వర్డ్స్ ని ఈ నగరానికి ఏమైంది సినిమాలో వాడిన తరుణ్ భాస్కర్ ఈసారి కీడా కోలా సినిమాలో ‘సీన్ అయితది’ అనే పదాన్ని వాడినట్లు ఉన్నాడు. కీడా కోలా ప్రమోషన్స్ ని ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్, బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఒక్కో ఆర్టిస్ట్ అప్డేట్ ని రివీల్ చేస్తున్నారు. బ్రహ్మానందం, చైతన్య రావు, రాగ్ మయూర్ లుక్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ మూవీ టీజర్ ని జూన్ 29న రిలీజ్ చెయ్యాల్సి ఉండగా జూన్ 28కి ప్రీపోన్ చేస్తూ తరుణ్ భాస్కర్ ట్వీట్ చేశాడు. కీడా కోలా టీజర్ ని జూన్ 28న రిలీజ్ చేసి 29న ఈ నగరానికి ఏమైంది సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. 28న కీడా కోలా చూసి 29న మీ గ్యాంగ్ తో కలిసి సినిమాకి రండి చూసుకుందాం అంటూ తరుణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు రీరిలీజ్ అయ్యి ఉంటాయి కానీ ఈ నగరానికి ఏమైంది కోసం గ్యాంగ్స్ మొత్తం కదిలి వెళ్లడానికి రెడీగా ఉన్నట్లు ఇంకో సినిమాకి ఇప్పటివరకూ జరగలేదు. మరి ఈ రీరిలీజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా.. పవన్ గురించి వర్మ ట్వీట్ వైరల్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలను కొన్నితెచ్చుకోవడంలో ఆయన తరువాతే ఎవరైనా. ప్రస్తుతం వర్మ.. మంచి సినిమాలు తీయడం మానేసి రాజకీయ బయోపిక్ లు తీయడం మొదలుపెట్టాడు. ఇక సినిమాలు కాకుండా ట్విట్టర్ లో టీడీపీ, జనసేన అధినేతలు అయిన చంద్రబాబు, పవన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. తాజాగా మరోసారి వర్మ, జనసేనాని పై పంచులు వేశాడు గత కొన్నిరోజులుగా పవన్.. వారాహి యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రలో పవన్ .. కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశాడు. “చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా అధికారం లో కొస్తే పీక పిసికేసి చంపేస్తా , బట్టలూడదీసి పరిగెత్తిస్తా ,చర్మం వొలిచేస్తా, లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా ఎవరూ అనుండరు. ఇంకో విషయమేంటంటే అధికారం లోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చు అని చెప్పడమా ? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింస ని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకొచ్చ్చే ఆ యువకులను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో పవన్ కళ్యాణ్ కే తెలియాలి. పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లల తో పాటు టీవిలో చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు ఇలా ట్వీట్ చేస్తుంటే.. సర్, మీరు ఇలాంటి మాటలు చెబుతుంటే, ప్రతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వెంటి వర్మ సడెన్ గా గౌతమ బుద్దలా మారిపోయావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.