మరో రూ.1,425 కోట్ల పెట్టుబడులు.. ఓ కంపెనీ ప్రారంభం, 3 కంపెనీలకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్‌కు క్రమంగా కంపెనీలు క్యూ కడుతున్నాయి.. మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి.. ఈ రోజు ఒక కంపెనీని ప్రారంభించడంతో పాటు మరో మూడు కంపెనీల నిర్మాణ పనులకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు వర్చువల్‌గా శిలాఫలకం ఆవిష్కరించి, శంకుస్ధాపన చేయడంతో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించిన ఏపీ సీఎం.. 1. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ తయారీని క్రిబ్‌కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతోంది.. క్రిబ్‌కో నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.610 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.. రోజుకు 500 కిలోలీటర్ల బయో ఇథనాల్ తయారీ లక్ష్యంగా ఉంది.. ఉప ఉత్పత్తిగా ఏడాదికి 64వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్, 4వేల టన్నుల డ్రైడ్ డిస్టిలరీ గ్రెయిన్స్ ఉత్పత్తి చేయనున్నారు.. ఇక, 2. నెల్లూరుజిల్లా సర్వేపల్లిలో విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్.. ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుంది.. ఇథనాల్ తయారీ కర్మాగార నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయగా.. రూ.315 కోట్ల పెట్టుబడులతో.. 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు.. రోజుకు 200 కిలోలీటర్ల బయోఇథనాల్ తయారీ లక్ష్యంగా ఉండగా.. విరిగిన బియ్యం, రంగు మారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్ తయారీ చేస్తారు. వరిని సాగుచేస్తున్న రైతులకు అత్యంత ఉపయోగకరం ఉండనుంది.. అలాగే మొక్కజొన్నను వినియోగించుకుని రోజుకు మరో 160 కిలోలీటర్ల డిస్టలరీ తయారీ బై ప్రొడక్ట్‌గా డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్. 3. తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటిల్ కాఫీ లిమిటెడ్ పుడ్ మరియు బెవెరేజెస్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు.. వర్చువల్‌గా ఈ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు సీఎం.. రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో ప్రత్యక్షంగా 400 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.. సంవత్సరానికి 16వేల టన్నుల సొల్యుబుల్ ఇన్‌స్టెంట్ కాఫీ తయారీ ప్లాంట్.. ఇక, 4. ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు కాబోతోంది.. రూ.100 కోట్ల పెట్టుబడితో 500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. రోజూ 400 టన్నుల ఎడిబుల్ ఆయిల్ తయారీ లక్ష్యంగా ఉంది.. రోజుకు 200 టన్నుల సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్‌ను వర్చువల్‌గా కంపెనీని ప్రారంభించారు సీఎం జగన్.
డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..!
అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆర్కే రోజా.. కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్నారు.. అయితే, ఈ రోజు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. నాకు ఆరోగ్యం బాగలేదని కొంతమంది సంతోషపడుతున్నారట.. డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తెలుస్తా..! అంటూ వ్యాఖ్యానించారు.. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు రోజా.. ఒక రోజు సీఎం అవ్వాలని అనుకుంటున్నా అంటాడు.. మరోరోజు ఎమ్మెల్యే అవ్వాలని చెబుతారు.. అసలు ఎమ్మెల్యే కూడా కాలేనోడు ఎందుకు తిరుగుతూన్నాడో అర్థం కాదు అంటూ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో అతనికే తెలియదు.. ప్రజల ఎమి చేస్తావో చెప్పకుండా జగన్, వైసీపీ నేతలపై చీప్‌గామాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో వచ్చింది సేవ చేయడానికా? లేక అధికార పార్టీ నేతలను కొట్టడానికా? అని ప్రశ్నించారు మంత్రి రోజా.. అమ్మవారి పేరు వాహనానికి పెట్టుకుని బూతుపురాణం చేబుతున్నాడు.. ప్రజలు దృష్టిలో పవన్ విలన్‌గా మారుతున్నాడని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.. ఇప్పటికైన చిరంజీవి చెప్పిన మాట పవన్ వింటే మంచిదని హితవుపలికారు.. మీరు గుంపులుగా వచ్చినా.. విడివిడిగా వచ్చినా 2024లో గెలిచేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీయే.. జగనే సీఎం రాసిపెట్టుకో అని నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.
పవన్‌ని చూస్తుంటే జాలేస్తోంది.. విషయం అర్థమైపోయినట్టుంది..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని మండిపడ్డారు.. చంద్రబాబు అండ్ కో రహిత రాజకీయలతోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా అతని మతి కూడా పోయింది.. ఇప్పుడు పవన్ కల్యా్‌ణ్‌ని చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు.. నిన్న ముమ్మిడివరంలో పవన్ నేను ఒడిపోతానని నాకు ముందే తెలుసు.. అయినా పారిపోను, పోరాడతా అంటున్నాడు.. దీనిని ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలి.. అయినా.. ఓడిపోతాననే విషయం ముందే పవన్ కల్యాణ్‌ను అర్థమైనట్టుందని ఎద్దేవా చేశారు. మరోవైపు.. వేల సంఖ్యలో పవన్ కల్యాణ్ కార్యక్రమాలకు వచ్చే జనం.. ఇప్పుడు వందల్లోకి పడిపోయారని సెటైర్లు వేశారు మంత్రి కొట్టు.. అమరావతిని కులరాజధాని అని ఎవరన్నారు.. అది ప్రూవ్ చేయడానికి కృషి చేసింది ఎవరో గ్రహించాలని సూచించారు.. కులం కోసం, రిజర్వేషన్లు కోసం ముద్రగడ పద్మనాభం పోరాడుతుంటే.. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని అగౌరవంగా మాట్లాడటం పవన్ కల్యాణ్ కుసంస్కారం అంటూ తీవ్రస్థాయిలో పవన్‌పై ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ.
తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది
తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు.. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ‘దశాబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ గ్రామాల నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటోకు పది తలలు అంటించి.. ఒక్కో తలకు ఒక్కో ప్రభుత్వ వైఫల్యాన్ని రాసి ఊరేగించారు. ఆ తర్వాత కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపులతో ‘ఎనీ టైం మనీ’ తరహా మద్యం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు విద్యను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. కెసిఆర్ దళితులను, బలహీన వర్గాలను దగా చేస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని రు.6 లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒక్క ఎకరానికి అయినా అదనంగా సాగు నీరు అందించారా..? అని నిలదీశారు. ఎస్ఆర్ఎస్‌పీ కాలువలకు తొమ్మిదేళ్లుగా మరమత్తులు చెపట్టలేదన్నారు. మిషన్ భగీరథ పేరిట రు.40 వేల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపణలు గుప్పించారు. అందరికీ సమాన విద్య అంటూ.. ‘కేజీ టు పీజీ’ హామీ అమలు చేయలేదని ఆగ్రహించారు.
పాక్ యూనివర్శిటీల్లో హోలీ నిషేధం..కారణం ఇదే ?
ఇస్లామిక్ గుర్తింపును కాపాడేందుకు దేశంలోని విద్యాసంస్థల్లో హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకోవడాన్ని పాకిస్థాన్ నిషేధించింది. దీని వల్ల తమ ఇస్లామిక్ గుర్తింపు ప్రమాదంలో పడుతుందని పాకిస్థాన్ భయపడుతోంది. హోలీ, ఇతర హిందూ పండుగలను జరుపుకునే అనేక వీడియోలు పాకిస్తాన్‌లో వెలువడ్డాయి. ఇప్పుడు పాకిస్థాన్ విద్యా శాఖ ఈ కఠిన చర్య తీసుకుంది. తమ విశ్వాసం ఇస్లాం మతంపై మాత్రమే ఉందని, మైనారిటీలపై తమ దౌర్జన్యాలు కొనసాగుతాయని పాకిస్థాన్ మరోసారి రుజువు చేసింది. హిందూ, సిక్కు జనాభాకు వ్యతిరేకంగా ఇది పెద్ద చర్యగా పరిగణించబడుతుంది. పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఉన్నత విద్యా కమిషన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మన సామాజిక-సాంస్కృతిక విలువలకు, దేశ ఇస్లామిక్ గుర్తింపుకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను చూడడం బాధాకరమని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇస్లామాబాద్ క్యాంపస్‌లో పాకిస్తాన్‌లోని క్వాయిడ్-ఎ-అజామ్ విశ్వవిద్యాలయానికి చెందిన వందలాది మంది విద్యార్థులు హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు రంగులు అద్దుకుని కనిపించారు. ఇలాంటి వీడియోలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని పాకిస్థాన్ కమిషన్ పేర్కొంది. ప్రజలు అధికంగా పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఈ తాలిబాన్ డిక్రీపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్‌లో మతపరమైన హింసకు సంబంధించిన అనేక కేసులు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు పాకిస్థాన్ తుగ్లక్ ఉత్తర్వు మానవ హక్కుల సంస్థలను మరోసారి ఆందోళనకు గురి చేసింది.
నాలుగు సార్లు ప్రేమలో పడినా.. రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా దేశంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరు. 85 ఏళ్ల వయసులో ఉన్న రతన్ టాటా ఈ వయసులోనూ చురుకుగా పనిచేస్తూ తన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారు. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. తన పూర్వీకుల ఆస్తి మొత్తాన్ని ‘ది టాటా గ్రూప్’కి ఇచ్చాడు. అతను తన జీవితమంతా తన సమూహ కంపెనీలకు.. దేశానికి అంకితభావంతోనే ఉన్నాడు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మరింత మెరుగుపరచడంలో ఎల్లప్పుడూ ప్రముఖ పాత్ర పోషించాడు. 85 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోని రతన్ టాటా ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు కాదు. అతను కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కానీ పెళ్లి చేసుకోలేకపోయాడు. అనేక ప్రయత్నాలు చేసిన అవి విఫలం కావడంతో రతన్ టాటా ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు అతని పాత ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అతను ఎన్నిసార్లు ప్రేమలో పడ్డాడో చెప్పాడు. ఇంటర్వ్యూలో రతన్ టాటాను మీరు ఎప్పుడైనా ప్రేమలో ఉన్నారా, అలా అయితే ఎన్నిసార్లు అని అడిగారు. దీనికి రతన్ టాటా చిరునవ్వుతో సమాధానమిస్తూ, ‘సీరియస్‌గా 4 సార్లు జరిగింది. ఒకసారి నేను అమెరికాలో పని చేస్తున్నప్పుడు గాఢ ప్రేమలో మునిగిపోయాను. నేను భారతదేశానికి తిరిగి వచ్చాను. ఆమె నాతో రాలేదు. ఆమె రావాలనుకుంది కానీ ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. రతన్ టాటా మాట్లాడుతూ, ‘నేను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు.. చైనా, భారతదేశం మధ్య యుద్ధం జరుగుతోంది. అమెరికాలో ఈ యుద్ధం చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. అలాంటి పరిస్థితుల్లో నా స్నేహితురాలి కుటుంబ సభ్యులు తమ కుమార్తెను పంపడానికి ఇష్టపడలేదు. దీని తర్వాత రతన్ టాటా తన జీవితాంతం బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఇప్పుడు అతని వయస్సు 85 సంవత్సరాలు.
భోళా మ్యానియా షురూ.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే.. ?
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చిరుకు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 24 న ఈ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ” మునుపెన్నడూ లేని విధంగా ఎంతో ఉత్సాహంతో మెగా సెలబ్రేషన్ కోసం సిద్ధంగా ఉండండి.. భోళా శంకర్ టీజర్ జూన్ 24 న వస్తుంది” అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతో చిరు మరో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.,
కామెడీ అయిపోయింది గురూ.. అల్లు అర్జున్ వాయిస్‌ను ట్రోల్ చేసిన హీరోయిన్ సోదరుడు
ఇప్పటి ఐకాన్ స్టార్ అప్పటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ లో దేశముదురు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో అయితే భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో బన్నీ స్టైల్, ఆటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో హన్సిక మోత్వానీ హీరోయిన్ గా పరిచయం అవగా ఆమె అందానికి, క్యూట్ నెస్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. 2007లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడమే కాదు మంచి వసూళ్లు కూడా రాబట్టింది. 2007న 400 థియేటర్లలో విడుదలైన దేశముదురు సినిమాలో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టాడు. అయితే ఈ మధ్యనే బన్నీ పుట్టినరోజు సందర్భంగా సినిమాను రీ రిలీజ్ కూడా చేశారు. ఆ సంగతి అలా ఉంచితే దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఈ మధ్య కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏంటి దొబ్బేస్తున్నారా? ఏంటి దాదాగిరినా? ఏంటి కామెడీనా? అంటూ కొందరు వ్యక్తులు చెబుతున్న డైలాగులు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ సోదరుడు నిఖిల్ థామస్ ఏమనుకున్నాడో ఏమో తాను తాజాగా ఒక వీడియో చూశాను, అందులో ఇలా ఉంది అంటూ బన్నీ వాయిస్ ను ఆయన కూడా ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయనకు బన్నీ వాయిస్ రాలేదు కానీ ఎవరైతే బన్నీ వాయిస్ ని ఇమిటేట్ చేస్తానని చెబుతూ ముందుగా వీడియో చేశాడో అతని వాయిస్ బాగా వచ్చింది. దీంతో నివేదా థామస్ తమ్ముడు అల్లు అర్జున్ వాయిస్ ను ట్రోల్ చేస్తున్నాడురా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.