భట్టి పాదయాత్రకు సోషల్ మీడియా నీరాజనం.. టాప్ ట్రెడింగ్‌లో #PeoplesLeaderBhatti హాష్ ట్యాగ్
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 100 రోజులకు చేరింది.. నేడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగుతుంది భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెళ్లివిరుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం ఉప్పల్ పాడు గ్రామంలో పాదయాత్ర శిబిరం వద్ద కేక్ కటింగ్ చేసి, బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు. కేతేపల్లి ప్రజలు భట్టికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు. భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.. మరోవైపు.. #PeoplesLeaderBhatti అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..
పవన్ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!
వారాహి యాత్రలో ప్రభుత్వంపై విరుచుకుపడుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పవన్ కల్యాణ్ సినీ నటుడు.. అసలు రాజకీయ నాయకుడే కాదు అంటున్నారు.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో ఎక్కడా లేనంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతోందన్నారు.. జగనన్న సురక్ష కార్యక్రమం కింద గవర్నెన్స్ ను ప్రజలకు మరింతగా తీసుకుని వెళ్లే ప్రయత్నం జరుగుతోందన్నారు. అర్హులై ఉండి ప్రభుత్వ పథకాలు అందని లబ్ధిదారులకు కూడా పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్న ఆయన.. టీడీపీకి ఎప్పుడూ ఇలాంటి ఆలోచనే చేయలేదని విమర్శించారు.. చిత్తశుద్ధితో ఉండటం వల్లే ఇలాంటి ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ కార్యక్రమమే చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు మింగుడు పడడంలేదన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఆస్వాదిస్తున్నారని తెలిపారు. ఇక, టీడీపీ బస్సు యాత్రలో నాయకులు ఎవరూ ఉండటం లేదని ఎద్దేవా చేశారు సజ్జల.. మినీ మేనిఫెస్టోతో చంద్రబాబు నవ్వుల పాలయ్యాడన్న ఆయన.. చంద్రబాబు మేనిఫెస్టో అనే మాట మాట్లాడకపోతేనే నయం అన్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే వాళ్లకే బూమ్ ర్యాంగ్ అవుతుందన్నారు.. చరిత్రలో ఈ విషయం స్పష్టం అయ్యిందన్నారు.. అయితే, పవన్ కల్యాణ్ బస్సు యాత్ర కులం అంశంపై నే చేస్తున్నారని స్పష్టం అవుతుందని ఆరోపించారు.. ముద్రగడ పద్మనాభం తన కులం కోసం గట్టిగా నిలబడిన వ్యక్తి.. ఆ కృషిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్న ఆయన.. ముద్రగడ నిజాయితీ గల వ్యక్తి.. మా పార్టీ విధానాలు నచ్చి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు. కానీ, ముద్రగడను ఎవరైనా కంట్రోల్ చేయగలరు అనుకోవటం అమాయకత్వం అవుతుందన్నారు.. మరోవైపు.. ఎన్నికలు దగ్గర పడుతుండటంతోనే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారంటూ.. ఏపీ, తెలంగాణలో భూముల ధరలపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి ఎలా ఉంటుందో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది.. నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నా పై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. జగనన్న తోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు. 2009 తర్వాత నాతో ప్రయాణం చేసినవారు ఉన్నారు.. కొందరు విడిపోయారు. కొందరు పోతున్నపుడు తెలుసుకోవాలని చాలామంది చెప్పారు.. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి దూరమయ్యా.. మంత్రి పదవి పోయిన తర్వాత బాగా తిరుగుతున్నానని తెలిపారు.. ఎందుకు అనిల్ నెమ్మదిగా ఉన్నాడని కొందరు అంటున్నారు.. కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు.. ఇప్పటిదాకా చేయాల్సింది చేశారు.. ఇక నుంచి చూడండి.. ఎలా ఉంటుందో అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్.. 2009 లో ఎమ్మెల్యే నేను అవుతానని చెబితే చాలా మంది నవ్వారు.. కానీ, జగనన్న సాక్షిగా ఎమ్మెల్యే, మంత్రిని అయ్యాను.. జగనన్న చెబితే ఏమైనా చేస్తా.. ఆయన్ని జన్మలో మోసం చేయలేదన్నారు.. నా సొంత డబ్బులతో కార్యకర్తలకు సాయం చేశాను. కొందరు నన్ను సాయం అడిగితే వీలైనంత చేశాను.. మంత్రిగా ఉన్నపుడు అనిల్ బాగా సంపాదించాడన్నారు అని ఆరోపించారు.. కానీ, ఏమీ లేదన్నారు.. నాకు నచ్చక పోతే మొహం మీదే చెబుతా.. నన్ను వ్యతిరేకించిన వాళ్లకు ఆ విషయం తెలుసన్నారు.. అనిల్ ఎక్కడ పోటీ చేసినా ఒడిస్తాం అని అంటారు.. జగనన్నకే చేస్తామని బయటకి చెబుతారు.. ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే నా ఎదుట మాట్లాడాలి అంటూ మండిపడ్డారు.
విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగు.. ఈటీఎస్‌తో ప్రభుత్వం కీలక ఒప్పందం
ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగులు పడుతున్నాయి.. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.. ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు.. ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. ఈటీఎస్ తరపున ఒప్పందంపై సంతకాలు చేశారు LEJO SAM OOMMEN, Chief Revenue Officer, ETS India, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బీ శ్రీనివాసరావు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్ధల విద్యార్ధులు ప్రపంచస్ధాయిలో ఉద్యోగాలు సంపాదించేలా ఎదగాలని కోరుకుంటున్నాం. ఆ దిశగా ప్రయత్నిస్తున్నాం. ఈ పిల్లలందరూ ప్రభుత్వ బడులు నుంచి వచ్చినవాళ్లు. వారి జీవితాల్లో మార్పుతేవడం ద్వారా వారి అభ్యున్నతికి కృషి చేస్తే దేవుడి దృష్టిలో వారి కుటుంబాలకు గొప్ప సేవచేసినవాళ్లం అవుతాం. మనం ఏ కార్యక్రమం చేసినా.. అట్టడుగు వర్గాలకు చెందిన వీళ్లను దృష్టిలో ఉంచుకుని.. వారి పట్ల మరింత సహృదయంతో పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక సవాల్‌తో కూడిన కార్యక్రమం. మీరు చేపడుతున్న కార్యక్రమాన్ని కేవలం జూనియర్ లెవెల్‌కే పరిమితం చేయకుండా.. ప్లస్ వన్, ప్లస్ టూ సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. 11, 12 తరగతులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం అప్పుడే విదేశాలకు వెళ్తారు. అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలని కోరారు.
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 36 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
రైల్వే ప్రయాణికులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే ఏకంగా 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటిచింది.. ఈ నెల అంటే జూన్ 26 తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 36 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.. ఈ నెల 26 నుంచి జులై 2వ తేదీ వరకు రద్దు చేయబడిన రైళ్ల వివరాల్లోకి వెళ్తే.. 07753 కాజీపేట్-డోర్నకల్, 07754 డోర్నకల్-కాజీపేట్, 07755 డోర్నకల్-విజయవాడ, 07756 విజయవాడ-డోర్నకల్, 07278 భద్రాచలం-విజయవాడ, 07979 విజయవాడ-భద్రాచలం, 07591 సికింద్రాబాద్-వికారాబాద్, 07592 వికారాబాద్-కాచిగూడ, 07462 సికింద్రాబాద్-వరంగల్, 07463 వరంగల్ -హైదరాబాద్, 07766 సిర్పూర్ టౌన్ – కరీంనగర్ సహా.. మొత్తం 36 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే..
కేంద్రం కీలక నిర్ణయం.. కరెంట్ బిల్లులు భారీగా తగ్గే ఛాన్స్
ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు మధ్య తరగతి వ్యక్తి బతకడమే కష్టంగా మారింది. ఏ వస్తువును ముట్టుకున్న ధరల మంటమండుతోంది. కాస్తంత ఆ మంట నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్ వేస్కుందాం అంటే కరెంట్ బిల్ షాక్ కొడుతోంది. దీంతో చావ లేక బతకలేక సామాన్యుడు నానాయాతన పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజలపై నిరంతరం అటు పన్నులు, ఇటు చార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరెంట్ బిల్లులు అమాంతం పెంచేశాయి. వినియోగం తక్కువగా ఉన్నా బిల్లు ఎక్కువగా వస్తోందని జనాల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే కేంద్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించే చల్లటి వార్తను చెప్పింది. దీంతో రానున్న రోజుల్లో మీ కరెంటు బిల్లులు భారీగా తగ్గే అవకాశం ఉంది. సామాన్య, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 చట్టంలో సవరణలు చేసింది. దీని ద్వారా వినియోగదారులు తమ కరెంట్ బిల్లులను తగ్గించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. టైమ్ ఆఫ్ డే (టీవోడీ) టారిఫ్ విధానం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ టారిఫ్ విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు విద్యుత్ బిల్లుల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అమెరికా పర్యటన చివరి రోజు.. CEOలతో సమావేశం కానున్న మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు రోజుల అమెరికా పర్యటనకు నేడు చివరి రోజు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో భారత, అమెరికా వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని భారతీయ ప్రజలను ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో నిన్న జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో భారత్ అంతరిక్షం, రక్షణ, సాంకేతికత బదిలీ వంటి పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది. వాషింగ్టన్ డిసిలోని విదేశాంగ మంత్రిత్వ శాఖలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో ప్రధాని మోడీ లంచ్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. దీని తర్వాత కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో వ్యాపారవేత్తలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. దీని తర్వాత కెన్నెడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో వ్యాపార ప్రముఖులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. FedEx, MasterCard, Adobeతో సహా US అగ్రశ్రేణి కంపెనీల అధిపతులు, Tech Mahindra, Mastec వంటి భారతీయ కంపెనీలు ఈ ఈవెంట్‌లో 1,200 మంది పాల్గొనే అవకాశం ఉంది.
పది పాసైన వారికి గుడ్ న్యూస్.. 3444 ప్రభుత్వ ఉద్యోగాలకు సిగ్నల్..
నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు పలు సంస్థ ల్లో ఉన్న ఖాళీలను గతంలో కన్నా ఎక్కువగానే పోస్టుల ను భర్తీ చెయ్యనున్నట్లు సమాచారం.. అందుకే వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను పూర్తి చెయ్యడానికి మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా రాజస్థాన్‌లోని జైపూర్ లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో 3444 ఖాళీల ను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు జూలై 5 వ తేదీతో ముగియనుంది.. ఆసక్తి కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3444 ఖాళీలకు గాను వీటిలో 574 సర్వే ఇన్‌ఛార్జ్ పోస్టులు ఉండగా.. 2870 సర్వేయర్ పోస్టులు ఉన్నాయి..
మలయాళ హీరో .. ఈసారి ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉన్నాడే
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ అనే కాకుండా అన్ని వుడ్స్ లో కూడా తన సత్తా చాటుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా దుల్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం కింగ్ ఆఫ్ కోథా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హోమ్ బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీతో సహా ఐదు భాషలలో పాన్-ఇండియా లెవల్లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలోని పాత్రలను అన్ని పరిచయం చేస్తూ.. సాగిన ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకొంటుంది. కన్నన్, ఐశ్వర్య లక్ష్మి, నీల ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, ఇలా వీరి పాత్రలను.. ఆర్ట్ రూపంలో చూపించారు. ఇక చివరగా.. కింగ్ ఆఫ్ కోథా గా దుల్కర్ సల్మాన్ ను పరిచయం చేశారు. మోషన్ పోస్టర్ కు హైలైట్ అంటే.. జాక్స్ బిజోయ్ మ్యూజిక్ అనే చెప్పాలి. దుల్కర్ చుట్టూ జనాలు.. మధ్యలో దుల్కర్ బ్యాక్ ను చూపించి అంచనాలను పెంచేశారు.ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పీపుల్ ఆఫ్ కోథా గా వీరిని పరిచయం చేశారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ గ్యాంగ్ స్టర్ గా మారిన పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడట. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఈ మలయాళ హీరో ఈ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేస్తాడేమో చూడాలి.
బ్రేకింగ్.. పూజా ప్లేస్ లో మీనాక్షి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. అసలు ఎవరు వస్తున్నారు.. ఎవరిని తీసేస్తున్నారు..? ఎందుకు తీసేస్తున్నారు..? అనేది కూడా ఎవరికి తెలియడం లేదు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత థమన్ తో పాటు పూజా హెగ్డే కూడా అవుట్ అంటూ పుకార్లు పుట్టాయి. ఇక అది అయ్యేలోపు థమన్ ఇన్.. పూజా అవుట్ అంటూ మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమెను ఎందుకు తీసేసారు..అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇక్కడ నుంచి పుకార్లు షికార్లు చేస్తూనే వస్తున్నాయి. శ్రీలీల వలనే పూజా వెళ్లిపోయిందని కొందరు. పూజా ప్లేస్ లో సంయుక్త మీనన్ వస్తుందని మరికొందరు. పూజా నటన నచ్చక త్రివిక్రమ్ తీసేశాడని ఇంకొందరు రకరకాలుగా చెప్పుకొస్తున్నారు. అసలు ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఎవ్వరికీ తెలియదు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా గుంటూరు కారం సినిమాకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదేంటంటే.. పూజా హెగ్డే ప్లేస్ లో మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం
ఆరోజు వెయ్యి మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు.. చిరంజీవి కీలక ప్రకటన
కొన్ని రోజులు క్రిందట ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ని ప్రారభించగా అక్కడ తనను ఇంతటి వాడిని చేసిన ప్రేక్షకుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక రిక్వెస్ట్ చేశారు. క్యాన్సర్ పై అవగాహన లేక చాలామంది ప్రమాదం బారిన పడుతున్నారని, దానిని ముందుగా గుర్తించాలన్నా ఏ టెస్టులు చేయించుకోవాలో తెలియని వారు చాలామంది ఉన్నారని ఆయన గ్రహించారు. వారందరి కోసం తమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పరీక్షల నిర్వహిస్తామని, వాటికి అయ్యే ఖర్చులు తానూ భరిస్తాను అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ క్యాన్సర్ టెస్ట్ క్యాంప్ సెంటర్స్ గురించి మెగాస్టార్ చిరంజీవి, డాక్టర్ గోపీచంద్ సంయుక్తంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం మూడు వారాల గతం నానక్ రామ్ గూడ స్టార్ హాస్పిటల్ లో క్యాన్సర్ టెస్టులకు సంబంధించి ఒక విభాగాన్ని నేను ప్రారంభించడం జరిగింది. ఆ రోజు డాక్టర్ గారితో నేను సంభాషించినప్పుడు వారిని నేను అడగడం జరిగింది. ఈ క్యాన్సర్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టుల్లో మా అభిమానులకు, అలాగే సినీ కార్మికులకు లబ్ది చేకూరే లాగా మనం ఏమైనా చేయగలమా? నాకు ఏదైనా చేయాలనిపిస్తుంది, మీరు ఏ విధంగా సహకరించగలరు? దానికి ఖర్చు ఏమవుతుంది? ఆ ఖర్చు నేను భరించడానికి రెడీగా ఉన్నాను, మీ సహకారం కావాలి డాక్టర్ అని అడిగినప్పుడు ఆయన అక్కడికక్కడే మాట ఇచ్చారు.