Vitality Blast: క్రీడా ప్రపంచంలో ఒకరి కంటే మరొకరు మొండి పట్టుదలగల ఆటగాళ్లను మీరు చూసే ఉంటారు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయం, నొప్పులు అవుతూనే ఉంటాయి. అయితే అవన్నీ మరిచిపోయి తమ లక్ష్యాన్ని చేరుకోవడంలో బిజీగా ఉంటారు ఆటగాళ్లు. అయితే క్రికెట్ ప్రపంచంలో కూడా చాలా మంది మొండి క్రికెటర్లు ఉన్నారు. వారి చేతులు, కాళ్ళు, ముఖం రక్తం కారుతున్నా.. వారు ఆడుతూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక బౌలర్ వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Harirama Jogaiah: ముద్రగడకు హరిరామ జోగయ్య కౌంటర్ లేఖ.. ఇప్పటి వరకు పెద్దమనిషివి అనుకున్నా..!
వైటాలిటీ బ్లాస్ట్ లో సోమర్‌సెట్ బౌలర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే బౌలింగ్ వేసేటప్పుడు అతని వేలికి గాయమైంది. బాలు వేసిన వెంటనే అతనివైపు రావడంతో.. దాన్ని ఆపే క్రమంలో బంతి అతని వేలికి తాకుతుంది. వెంటనే మెర్వ్ నొప్పితో గంతులేస్తాడు. అంతేకాకుండా అతని వేలు మెలితిరిగి పోయింది. వెంటనే ఫిజియో స్టేడియంలోకి వచ్చి వేలు లాగుతాడు. అయినప్పటికీ.. మార్వ్ మళ్లీ బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఫిజియో అతని వేలిని లాగి కొద్దిగా సరిదిద్దిన వెంటనే.. మార్వ్ తన ఓవర్ పూర్తి చేశాడు. అయితే బ్యాటర్ మాట్ క్రిస్టియన్ షాట్‌ను ఆపే సమయంలో మార్వ్ వేలికి గాయమైంది.
Read Also: Tamanna : వైట్ డ్రెస్సులో తమన్నా కిల్లింగ్ పోజులు..
ఈ మ్యాచ్‌లో, మార్వ్ డేనియల్.. సామ్స్‌ను బౌల్డ్ చేశాడు. అంతేకాకుండా రాబిన్ దాస్ క్యాచ్ పట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ జట్టు 19.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. ఎసెక్స్ జట్టు నుంచి రాబిన్ అత్యధికంగా 72 పరుగులు చేశాడు. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సోమర్‌సెట్.. 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది. టామ్ బాంథియోన్ అత్యధికంగా 42 పరుగులు చేశాడు.