Jasprit Bumrah: డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఇంకా ఆ మ్యాచ్ పై భారత క్రికెటర్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు క్రికెట్ అభిమానులు. బ్యాటింగ్ సరిగా లేకపోవడమని బౌలింగ్ లో పట్టులేదని ఇలా రకరకాల విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు భారత్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెన్నునొప్పి కారణంగా గత కొంతకాలంగా క్రికెట్ కు దూరమైన స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా గ్రాండ్ రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు కీలక మ్యాచ్ ల్లో భారత్ బౌలింగ్ కొద్దిగా పేలవంగా ఉంది. అయితే ఇప్పుడు బుమ్రా రీ ఎంట్రీ అనడంతో ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. బుమ్రా వస్తే బౌలింగ్ లో మెరుగు కనపడుతుందని అంటున్నారు. మరోవైపు బుమ్రాతో పాటుగా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయేస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వన్డే ప్రపంచకప్ లో టీమిండియా జెర్సీతో బుమ్రా మెరవడం ఖాయంగా కనిపిస్తుంది.
Read Also: Allu Arjun – Trivikram: మాస్ మసాలా కాంబో సెట్టు.. ఇక ప్రకటనే లేటు!
ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. ఆగస్ట్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి జస్ప్రీత్ బుమ్రా పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ నెలలో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియా, ఐర్లాండ్ వెళ్లనుంది. ఆగస్ట్ 18న మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి బుమ్రా రీ ఎంట్రీ చేస్తాడని ఓ జాతీయ మీడియా కథనంలో వెల్లడించింది. ఐర్లాండ్‌తో సిరీస్ ద్వారా బుమ్రా ఫిట్‌నెస్ మీద ఓ అంచనాకు రావచ్చని మేనేజ్ మెంట్ భావిస్తోందట. ఈ సిరీస్ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సన్నాహకంగా బుమ్రాకు ఐర్లాండ్ టూర్ ఉపయోగపడుతుందని టీమ్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్‌లో జరిగే ఐర్లాండ్ సిరీస్ కోసం బుమ్రా సిద్ధంగా ఉన్నాడని.. ఇది టీమ్ ఇండియాకు ఎంతో శుభసూచకమని బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
Read Also: Viral: ఓరయ్య.. వీళ్లు ఫస్ట్ నైట్ దాకా కూడా ఆగనట్లున్నారే
అయితే వెన్నునొప్పి కారణంగా గతేడాది సెప్టెంబర్ నుంచి టీమ్ ఇండియా జెర్సీకి బుమ్రా దూరమయ్యాడు. గతేడాది ఆసియా కప్‌కు దూరమైన బుమ్రాను టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడించారు. అయితే గాయం కాస్త ఎక్కువవడంతో ఐపీఎల్‌తో పాటుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలకమ్యాచ్‌లకు బుమ్రా దూరమయ్యాడు. దీనితో బౌలింగ్ లో బుమ్రా లేని లోటు స్పష్టంగా కనపడింది. బౌలింగ్ విభాగంలో కాస్త బలహీనంగా ఉండటంతో కీలక మ్యాచ్‌లలో టీమిండియాకు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా వస్తున్నాడనే వార్త క్రికెట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.