ఇటీవల ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందింది. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. రోహిత్ టైం అయిపోయింది.. అతను కెప్టెన్సీ చేయడం కష్టమంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. దీంతో పలువురు రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతున్నారు. అయితే బీసీసీఐ కూడా కెప్టెన్ ని మార్చాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
స్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది.