2023 వన్డే ప్రపంచకప్‌లో మూడింటిలో మూడు గెలిచి మంచి ఫాంలో ఉన్న టీమిండియా.. రేపు బంగ్లాదేశ్ తో తలపడనుంది. పుణే వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఎలాంటి ప్లాన్స్ లేవని మాంబ్రే స్పష్టం చేశాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. పాకిస్థాన్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఓటమి నుంచి పాకిస్థానీలు ఇంకా తేరుకోవడం లేదు. మరోవైపు రేపు పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో బంగ్లా ఆటగాళ్లకు పాకిస్తాన్ కు చెందిన నటి సెహర్ షిన్వారీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్‌పై…
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అందులో టీమిండియా ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. ప్రపంచ కప్ 2023లో భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ మూడింటిలో విజయం సాధించింది. అందుకు కారణం బౌలింగ్, బ్యాటింగ్ నుంచి మంచి ప్రదర్శన కనపరచడం. తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో దంచికొట్టాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందుకు ఎగబాకాడు. ఇక టీమిండియాలో మరో యువ ఓపెనర్ శుభ్మాన్…
ఈ వరల్డ్ కప్ లోనైనా పాకిస్తాన్ గెలవాలనే కసితో దిగినప్పటికీ.. 8వ సారి ఇండియా చేతిలో ఓటమిపాలైంది. మరోసారి పాకిస్థాన్‌పై టీమిండియా అద్భుతం చేసి చూపించిందని గంభీర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చూపించిందని గంభీర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఇండియా-పాక్ ఈ టీమ్స్ ఎప్పుడు ఆడినా హోరాహోరీగా తలపడతాయని.. గెలుపు కోసం చివరి వరకు పోరాడతాయన్నాడు.
ధర్మశాలలో జరిగిన ప్రపంచ కప్ 2023 మ్యాచ్ లో నెదర్లాండ్ సంచలన విజయం సాధించారు. 38 పరుగుల తేడాతో నెదర్లాండ్ టీం సౌతాఫ్రికాపై గెలుపొందారు. మొదట వర్షం కారణంగా ఇరు జట్లకు 43 ఓవర్లకు కుదించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 245/8 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 207 పరుగులు చేసి ఆలౌటైంది.
టీమిండియాపై పాకిస్థాన్ ఓటమి తర్వాత బాబర్ అజామ్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని సొంత దేశానికి చెందిన పలువురు మాజీ ఆటగాళ్లు జట్టు వైఖరి, బాబర్ అజామ్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పాక్ జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రికార్డ్ నెలకొల్పింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 275 పరుగులు చేసింది. దీంతో టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా పంజాబ్ ముందుంది. ఇంతకుముందు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఈ రికార్డ్ ఉండేది. దాదాపు 10 ఏళ్ల రికార్డును పంజాబ్ బద్దలు కొట్టింది. ఐపీఎల్ 2013లో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 263 పరుగులు చేసింది.
లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఆడే క్రికెట్లో చాలా మంది స్టార్ ఇండియన్ క్రికెటర్లు పాల్గొనలేరు. 2028 నాటికి.. చాలా మంది ఇండియా ఆటగాళ్ల వయస్సు రిటైర్మెంట్ లేదా రిటైర్మెంట్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత స్టార్ ఆటగాళ్లు ఆడటం చాలా కష్టం. ప్రస్తుతం.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 36 సంవత్సరాలు ఉండగా.. 2028 ఒలింపిక్స్ నాటికి అతని వయస్సు 41 సంవత్సరాలు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అతను అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే…