ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. అందులో టీమిండియా ఆటగాళ్లు టాప్-10లో ఉన్నారు. ప్రపంచ కప్ 2023లో భారత్ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ మూడింటిలో విజయం సాధించింది. అందుకు కారణం బౌలింగ్, బ్యాటింగ్ నుంచి మంచి ప్రదర్శన కనపరచడం. తొలి మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత రెండు మ్యాచ్ ల్లో దంచికొట్టాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందుకు ఎగబాకాడు. ఇక టీమిండియాలో మరో యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ కూడా.. తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. మరో టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ ప్రపంచకప్ లో మంచి ప్రదర్శన చూపిస్తుండటంతో.. ఈ ముగ్గురు టాప్-10లో స్థానం సంపాదించారు.
Read Also: Ananya Nagalla: చీరకట్టులో..చిలిపి నవ్వుతో మనుసు దోచేస్తున్న అనన్య నాగల్ల
ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 719 పాయింట్లతో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌పై 131 పరుగులు, పాకిస్థాన్‌పై 86 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడి ఆరో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 711 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచులు ఆడకపోనా గిల్(818) తన రెండో స్థానంలోనే ఉండడం విశేషం. నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న బాబర్ అజామ్ విఫలమవడం గిల్ కి కలిసి వచ్చింది. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 836 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ర్యాంకింగ్ 20 నుండి నంబర్-19కి చేరుకున్నాడు.
Read Also: NewsClick Case : హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన ప్రబీర్ పుర్కాయస్థ
ఇక ఐసీసీ విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్ లో.. జోస్ హేజిల్‌వుడ్ 660 పాయింట్లతో నంబర్-1 స్థానంలో ఉన్నాడు. అద్భుత ప్రదర్శన చేసి 659 పాయింట్లతో ట్రెంట్ బౌల్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ 656 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టాప్-10లో రెండో భారత బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ 641 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.