ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో స్థానంలో ఉంది. నెదర్లాండ్స్ ఫీల్డర్లు 84 శాతం అవకాశాలను క్యాచ్‌లుగా మార్చుకున్నారు.
Tarmarind Cultivation : రైతులకు సిరులు కురిపిస్తున్న చింత సాగు..
భారత్, నెదర్లాండ్స్ తర్వాత.. పాకిస్తాన్ మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ ఫీల్డర్లు 82 శాతం అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కాగా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ ఫీల్డర్లు 81 శాతం క్యాచింగ్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్. కివీస్ ఫీల్డర్లు 77 శాతం అవకాశాలను క్యాచ్‌లుగా మార్చుకున్నారు. ఈ విధంగా చూస్తే భారత్‌తో పాటు టాప్-5లో నెదర్లాండ్స్, పాకిస్థాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఉన్నాయి. అయితే ఐదుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు టాప్-5లో చోటు దక్కించుకోలేదు.
Minister Botsa: ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో బయటపడ్డారు..
కాగా.. పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. మూడు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత జట్టు 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ కూడా 3 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లను కలిగి ఉంది. అయితే టీమిండియా నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. భారత్, న్యూజిలాండ్ తర్వాత దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లు సాధించింది. పాకిస్థాన్ 3 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంక వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాల్లో ఉన్నాయి.