నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న నన్ను మా బిడ్డల్లాంటి కార్యకర్తలు కలవకూడదా..? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. నాకు మనోధైర్యం కలిగించేలా టీడీపీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముంది..? అని నిలదీశారు.. బాధలో ఉన్న అమ్మను కలుస్తామంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులివ్వడమేంటీ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పే హక్కు ఈ…
వరల్డ్ కప్ 2023లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన ఖాతాను తెరిచింది. ఈరోజు లక్నోలో జరిగిన ఆస్ట్రేలియా-శ్రీలంక మ్యాచ్ లో ఆసీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఈ వరల్డ్ కప్ లో ఆడిన మూడు మ్యాచ్ లో మూడు ఓడిపోయింది.
పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు.
నిన్న జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్ లో 69 పరుగుల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్ పై క్రికెట్ ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అంతేకాకుండా.. ఇంగ్లండ్ ఆఫ్ఘాన్ పై ఓడటంతో చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అంటే అందరికి అభిమానమే. తన అద్భుతమైన బ్యాటింగ్ తోనే కాకుండా.. తన హెల్పింగ్ నేచర్ తో కూడా అభిమానులను అలరిస్తాడు. అయితే తాజాగా.. ఈసారి ఏకంగా అభిమానుల మనసులనే గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మధ్యలో వర్షం పడింది. ఆ సమయంలో గ్రౌండ్ సిబ్బంది కవర్లు తీసుకుని స్టేడియంలోకి వస్తుంటే వారికి డేవిడ్ వార్నర్ సహాయం చేశాడు. దీనిపై అభిమానులు డేవిడ్ భాయ్ పై ప్రశంసల జల్లు…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో తమ జట్టును అన్ని రకాలుగా చిత్తు చేసిందని తెలిపాడు. పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిందని కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా.. టీమిండియా ముందు పాకిస్తాన్ జట్టు ఓ చిన్న పిల్లల జట్టులా కనిపించిందని విమర్శలు చేశాడు.
ప్రపంచకప్ లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బ. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ భారీ ఓటమి తర్వాత, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికైనా ఇంగ్లండ్ ప్రపంచ కప్ 2023లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుందని చెప్పాడు.
2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్ ప్రవేశించింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌తో పాటు మరో 4 క్రీడలను చేర్చాలని అధికారిక నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్‌తో పాటు, బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోస్ కూడా నిర్వహించనున్నారు. గత శుక్రవారమే ఒలింపిక్స్‌లో ఈ ఐదు క్రీడాంశాల ప్రవేశానికి సంబంధించి చర్చలు జరిగాయి. వాస్తవానికి.. ఈ ఐదు క్రీడలను ఒలింపిక్స్…
నిన్న జరిగిన ప్రపంచ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో అతను భారత అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత అభిమానులు ఆఫ్ఘనిస్థాన్‌కు మద్దతుగా నిలిచారని పేర్కొన్నాడు. అంతేకాకుండా 'ఢిల్లీ ప్రజలు మంచి హృదయం కలవారని.. స్టేడియంలో ఉన్న క్రికెట్ అభిమానులందరు తమకు…