రేపు హెచ్‌సీఏ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు తలపిస్తున్నాయి. పోటా పోటీగా ప్రెస్ మీట్ లు, ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం చేసుకుంటున్నారు. దీంతో హెచ్‌సీఏ ఎన్నికలకూ రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్-బీజేపీ మద్దతుదారుల మధ్య పోటీ కొనసాగుతుంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఈ క్రమంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు దూరమై.. ఆఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీమిండియా ఫర్ ఫెక్ట్ గా ఉందనుకున్న సమయంలో.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు.…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూపీఎల్‌లోని మొత్తం ఐదు జట్లు ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి. అందులో 60 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. 29 మంది ఆటగాళ్లు విడుదలయ్యారు. రిలీజ్ చేసిన వారిలో పెద్ద బ్యాట్స్ మెన్లు కూడా ఉన్నారు.
రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు జల్లు కురిపించాడు. రోహిత్ ఒక గొప్ప బ్యాట్స్‌మెన్ అని కొనియాడాడు. గతంలో కెప్టెన్ గా ధోనీకి టీమ్ సభ్యుల్లో ఎంతో గౌరవం ఉండేదో... ఇప్పుడు రోహిత్ కు అలాంటి గౌరవం లభిస్తోందని చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ వరుసగా గెలిచి నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఆఫ్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించింది.
న్డే ప్రపంచకప్ 2023లో భాగంగా.. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. కెప్టెన్‌తో సహా చాలా మంది ఆటగాళ్లు క్యాచ్ లు పట్టడంలో విఫలమయ్యారు. ఆఫ్ఘాన్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం 7 క్యాచ్‌లను వదులుకుంది.
ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారత్.. మూడు మ్యాచ్‌ల్లోనూ ప్రత్యర్థి జట్లను సులువుగా ఓడించింది. అయితే జట్టు గెలుపుకు కావాల్సింది కేవలం బ్యాటింగ్, బౌలింగ్ కాదు.. ఫీల్డింగ్ కూడా ముఖ్యం. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా ఫీల్డర్లు క్యాచ్ లు పట్టడంలో అగ్రస్థానంలో ఉన్నారు. 93 శాతం క్యాచ్‌లను భారత ఫీల్డర్లు సద్వినియోగం చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాబితాలో భారత్ తర్వాత నెదర్లాండ్స్ రెండో…