ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫాంలో ఉన్నాడు. తొలి మ్యాచ్లో విఫలమైనా.. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్ల్లో చితకబాదాడు. ఆఫ్ఘనిస్తాన్ పై సెంచరీ కొట్టగా.. పాకిస్తాన్ పై 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇవాళ బంగ్లాతో జరగబోయే మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతాడని అందరు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే.. స్టేడియంలో ఉన్నంత సేపు పరుగుల వర్షం కురిపించే హిట్ మ్యాన్.. డ్రెస్సింగ్ రూమ్లో చాలా కూల్గా ఉంటాడని తోటి ఆటగాళ్లు చెబుతున్నారు.
Read Also: Dabur India: డాబర్ ఉత్పత్తులపై యూఎస్, కెనడాల్లో కేసులు.. క్యాన్సర్‌కి కారణమవుతున్నాయని ఆరోపణలు..
ఈ క్రమంలో రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు జల్లు కురిపించాడు. రోహిత్ ఒక గొప్ప బ్యాట్స్మెన్ అని కొనియాడాడు. గతంలో కెప్టెన్ గా ధోనీకి టీమ్ సభ్యుల్లో ఎంతో గౌరవం ఉండేదో… ఇప్పుడు రోహిత్ కు అలాంటి గౌరవం లభిస్తోందని చెప్పాడు. అంతేకాకుండా.. తన తోటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని… తాను కూడా గతంలో రోహిత్ తో డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకున్నానని తెలిపాడు.
Read Also: MLC Jeevan Reddy: రాహుల్ గాంధీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు లేదు
రోహిత్ చాలా కూల్ పర్సన్… అతను ప్రతి ఆటగాడి అభిప్రాయాలను శ్రద్ధగా వింటాడని సురేశ్ రైనా అన్నాడు. అంతేకాకుండా ఫామ్ లో లేని ప్లేయర్లలో కూడా నమ్మకాన్ని నింపి, వాళ్లు బాగా ఆడేలా ప్రోత్సహిస్తాడని తెలిపాడు. తనలో ఉన్న మంచి క్వాలిటీ.. టీమ్ ను ముందుండి నడిపించేందుకు ఇష్టపడతాడని చెప్పాడు. తాను ఒక ఆటగాడిగా కూడా రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తాడని… కెప్టెన్ బాగా ఆడితే డ్రెస్సింగ్ రూమ్ లో అతనిపై గౌరవం ఆటోమేటిక్ గా పెరుగుతుందని అన్నాడు. ఇకపోతే.. టీమిండియాలో నెక్ట్స్ ధోనీ ఎవరని తనను ఎవరైనా అడిగితే… తాను రోహిత్ శర్మ పేరే చెపుతానని రైనా చెప్పుకొచ్చాడు. ఇండియన్ టీమ్ లో మరో ధోనీ రోహిత్ అని అన్నాడు.