వారికి శుభవార్త.. కాసేపట్లో ఖాతాల్లో రూ.10 వేలు జమ..
సంక్షేమ పథకాల అమలులో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ముందుంది.. వరుసగా నాలుగో ఏడాది జగనన్న చేదోడు సాయం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వేదికకానుంది.. వైడబ్ల్యూసీఎస్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి ఈ పథకం లబ్దిదారులకు నిధులు విడుదల చేయనున్నారు సీఎం జగన్.. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 3,25,020 మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు రూ.325.02 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు.. జగనన్న చేదుడో పథకం కింది రాష్ట్ర వ్యాప్తంగా 3.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక చేయూత అందిస్తోన్న విషయం విదితమే.. వర్చువల్ గా లబ్దిదారుల ఖాతాల్లో ఈ రోజు నిధులు జమ చేయనున్నారు.. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందించిన మొత్తం రూ.1252.52 కోట్లుగా ఉంది. జగనన్న చేదోడు పథకం కింద షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఏటా రూ. 10,000 చొప్పున సాయం చేస్తూ వస్తుంది వైసీపీ సర్కార్.. ఈ రోజు అందించనున్న సాయంతో కలిపి ఒక్కొక్కరికి రూ.40,000 వరకు ఆర్థిక సాయం అందించింది.. ఈ స్కీమ్ కింద నాలుగేళ్లలో లబ్దిదారులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 1,252.52 కోట్లకు చేరనుంది.. రాష్ట్రంలోని 1,80,656 మంది టైలర్లకు ఈ విడత సాయంగా రూ. 180.66 కోట్ల లబ్ధి చేకూరనుండగా.. 39,813 మంది నాయీ బ్రాహ్మణులకు రూ. 39.81 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు.. ఇక, 1,04,551 మంది రజకులకు ఈ విడతలో రూ. 104.55 కోట్ల లబ్ధి జరగనుంది.
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్..!
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గత నెల 9వ తేదీన అరెస్ట్ చేసింది సీఐడీ.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు… అయితే, విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు విధించిన రిమాండ్ ఈ రోజుతో ముగియనుంది.. దీంతో.. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును వర్చువల్‌గా ప్రవేశపెట్టనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు.. కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రిమాండ్ నేటితో 41వ రోజుకు చేరింది.. మరోవైపు.. తొలి రిమాండ్ ముగిసిన తర్వాత చంద్రబాబు కోర్టు ఎదుట వర్చువల్‌గానే హాజరయ్యారు.. అప్పట్లో కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతించడంతో అధికారులు జైల్లోనే చంద్రబాబును రెండు రోజుల పాటు ప్రశ్నించారు.. ఇక, ఆ తర్వాత కూడా వర్చువల్ విధానంలోనే చంద్రబాబును న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు జైలు అధికారులు.. జడ్జి ఆయన జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ వచ్చారు.. నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగియనుండగా.. ఈ రోజు కూడా ఆయన్ని వర్చువల్‌గా ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు. అయితే, చంద్రబాబుకు స్కిల్ కేసులో విముక్తి లభిస్తోందా? మరోసారి రిమాండ్ పొడిగింపు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.. ఏసీబీ కోర్టుతో పాటు.. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కూడా చంద్రబాబు పిటిషన్లపై విచారణ సాగుతోన్న విషయం విదితమే.
మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.. అక్టోబరు 15వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు.. 24వ తేదీ వరకూ కొనసాగనున్నాయి.. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు మహా చండీ దేవిగా దర్శనమిస్తూ.. భక్తులను అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనానికి బారులుతీరారు.. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మీ, మహాకాళీ, మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహా చండీ అమ్మవారు ఉద్భవించినట్టు చెబుతారు.. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే అనే పురానాలు చెబుతున్నాయి.. శ్రీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారటం, ఏ కోరికలతో ప్రార్థిస్తామో ఆ కోరికలు అన్నీ సత్వరమే నేరవేరుతాయని భక్తుల విశ్వాసం.. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు. హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం.. రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్లి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అలా మాతృ దేవత అనుగ్రహంతో సరస్వతి దేవి, లక్ష్మీదేవి , మహాకాళి.. చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరించారని పురాణాలు చెబుతున్నాయి.
సింగరేణి ప్రైవేటీకరణ బిల్లుకు కవిత మద్దతు పలకలేదా..?
2017 న సింగరేణి ఫ్రీవేటికరణ బిల్లు వచ్చింది.. అప్పుడు కవిత మద్దతు పలకలేదా? అంటూ కవితపై టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గని ఎదుట టీ కాంగ్రెస్ నేతలు కార్మికులతో సమావేశమయ్యారు. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు కీలకపాత్ర పోషించారని రేవంత్‌రెడ్డి అన్నారు. సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొనకపోతే తెలంగాణ వచ్చేదా..? అని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గుగని సంగం గౌరవ అధ్యక్షురాలు కవిత అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సమస్యలు పరిష్కారం చేయాల్సింది కేసీఆర్.. కానీ.. ఇద్దరు ఒకటే కుటుంబ సభ్యులు అని అన్నారు. ఒకరు ఆడిగినట్టు.. ఇంకొకరు తిట్టినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. 8 ఏండ్లుగా సింగరేణికి ఒక్కడే అధికారి కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనుల 2017 న సింగరేణి ఫ్రీవేటికరణ బిల్లు వచ్చిందని అన్నారు. అప్పుడు కవిత మద్దతు పలకలేదా..? లిక్కర్ దోస్తు కి మైన్ ఇవ్వలేదా..? అని రేవంత్ ప్రశ్నించారు. ఆదాయ పన్ను నుండి మినహాయిస్తాము.. పేరు మారుపు.. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో శ్రీధర్ బాబు ఉన్నారని అన్నారు. సింగరేణి కార్మికుల హక్కు ఎన్నికలు.. మొండి ఎద్దులెక్క ముడ్డి అడ్డం పెడుతుంది ప్రభుత్వం అని రేవంత్ పైర్ అయ్యారు. కార్మికులు అంతా కాంగ్రెస్ కి అండగా ఉండాలని కోరారు. కార్మికులు ఎన్నికల్లో బల ప్రదర్శన చూపాలని కోరారు. ఎర్రబెల్లి అ ఆ లు కూడా సక్కగా రాయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని సొంత కులపొడు అని మంత్రిని చేసిండు కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత కాంగ్రెస్ దే అని రేవంత్ హామీ ఇచ్చారు.
గుడ్డు టాస్క్‌లో భళా అనిపించినా జిలేబి పురం బ్యాచ్..
బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కాస్త కష్టమే.. మొన్నటివరకు నువ్వా నేనా అంటూ కాలు రూవ్విన బ్యాచ్ కాస్త నిన్న పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు.. అంతా కలిసిపోయి నవ్వులు పూయించారు.. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్ ఎక్కువగా సాయం చేస్తే వాళ్లు విన్నర్ అవుతారని వారిలో ఒకరు కెప్టెన్ అవుతారని తెలిపారు బిగ్ బాస్. దాంతో ముందుగా రెండు టీమ్స్ గ్రహాంతర వాసులను సంతోష పెట్టాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఆ టాస్క్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు హౌస్ మేట్స్.. అటు జిలేబీ పురంలో సర్పంచ్ గా ప్రియాంక. జోతిష్కుడిగా భోలే , అశ్విని.. పల్లెటూరి అమ్మాయిగా అశ్విని. ఇక రెండు ఊర్లు పెద్ద మనిషిగా శివాజీ నటించారు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. గులాబీ పురం బ్యాచ్ కంటే జిలేబీ పురం బ్యాచ్ బాగానే నవ్వించారు. ఆతర్వాత మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ అసలు ట్విస్ట్ అనే చెప్పాలి..
ఊగిపోతున్న ఫాన్స్.. బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం! అంతేకాదు..
టాలీవుడ్ అగ్ర హీరో, నటసింహం బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు వింటేనే ఫ్యాన్ ఊగిపోతుంటారు. సిచ్యూవేషన్‌తో సంబంధం లేకుండా.. ‘జై బాలయ్య.. జై బాలయ్య’ అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక బాలయ్య బాబు సినిమా రిలీజ్ ఉందంటే ఊరుకుంటారా?.. ఆ రచ్చ మరో లెవల్లో ఉంటుంది. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’ రిలీజ్ సందర్భంగా ఫాన్స్ ఆయన చిత్ర పటానికి ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు. భగవంత్ కేసరి సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా కర్ణాటకలో బాలయ్య బాబు ఫాన్స్ తమ అభిమానాన్ని భిన్నంగా చాటుకున్నారు. పాలాభిషేకం బదులుగా ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేశారు. బెంగళూరులోని మారతహళ్లిలో ఉన్న వినాయక థియేటర్ ముందు ఈరోజు ఉదయం 4 గంటలకు బాలకృష్ణ చిత్ర పటానికి మాన్షన్ హౌస్ మందు బాటిల్‌తో ఓ ఫ్యాన్ అభిషేకం చేశాడు. అంతేకాదు దీపారాధన చేసి కొబ్బరి కాయలు కూడా కొట్టారు. మరోవైపు భారీగా బాణాసంచా కూడా కాల్చారు. బాలయ్య బాబుకు ‘మాన్షన్ హౌస్’ అభిషేకం చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ‘బాలయ్య బాబు హా.. మజాకా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘బాలయ్య బాబుతో అట్లుంటది మరి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. శ్రీలీల కీలక పాత్ర పోషించారు. కూతురు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగుతుంది.
‘భగవంత్ కేసరి’ ట్విట్టర్ రివ్యూ.. బాలయ్య బాబు ఖాతాలో హ్యాట్రిక్! శ్రీలీల సూపర్బ్
నందమూరి నటసింహం బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన చందమామ కాజల్ అగర్వాల్ నటించగా.. కూతురి పాత్రలో యువ హీరోయిన్ శ్రీలీల నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ పాత్ర చేశారు. యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 19) భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ ప్రీమియర్స్ పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మొదటి షో పడింది. సినిమా చూసిన ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. భగవంత్ కేసరి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా అదిరిపోయిందని, బాలయ్య బాబు హ్యాట్రిక్ కొట్టారని రివ్యూ ఇస్తున్నారు. ‘భగవంత్ కేసరి బొమ్మ అదుర్స్. ఫామిలీకి బాలయ్య బాబు బాగా కనెక్ట్ అవుతారు. సినిమాలో డిఫెరెంట్ బాలయ్యను చూస్తారు’, ‘భగవంత్ కేసరి సినిమా కమర్షియల్ ఎంటర్ టైనర్’, ‘ఫస్ట్ హాఫ్ బాగుంది. బాలయ్య కమ్ముశాడు. సెకండ్ హాఫ్ ఓకే. సూపర్ హిట్’, ‘భగవంత్ కేసరి హిట్ కొట్టింది. నందమూరి అభిమానులకు పండగే’, ‘బాలయ్య బాబు ఇరగదీశారు. శ్రీలీల సూపర్బ్. కాజల్ ఓకే’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.