విరాట్ కోహ్లీ వన్డే కెరీర్ లో మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేయనున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ 49 సెంచరీలు చేశాడు. సచిన్ 463 మ్యాచ్ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు.
ప్రపంచకప్ 2023లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. ఈ ట్రోఫీలో తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైనప్పటికీ.. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ కొట్టాడు.. ఆ తర్వాత పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇవాళ(గురువారం) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 7 ఫోర్లు, 2…
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ప్రపంచకప్ 2023 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియాను ఎంకరేజ్ చేయడానికి అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు క్రికెట్ స్టేడియానికి వచ్చారు. అందులో భాగంగానే భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ కూడా వచ్చి క్రికెట్ ను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉంటే.. తన ఫ్రెండ్స్ తో మంచి మూడ్ లో ఉన్న సారా.. శుభ్ మాన్ గిల్ క్యాచ్ పట్టగానే సారా…
పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు లిటన్ దాస్, తంజీద్ హాసన్ శుభారంభం అందించారు. వీరిద్దరు అర్థసెంచరీలు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు చెతులెత్తేశారు.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఒకప్పుడు బలమైన జట్టుగా ఉండేదని.. నిప్పులు చెరిగే పేస్ బౌలర్లు, బంతిని గింగిరాలు తిప్పే స్పిన్నర్లు ఉండేవాళ్లని, అంతేకాకుండా బ్యాట్స్ మెన్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
పాకిస్తాన్ జట్టు తన నాలుగో మ్యాచ్ను ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు పాకిస్తాన్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేసింది. బెంగుళూరులో జరిగిన పేలుడు ఘటనపై పాకిస్తాన్ జట్టు భద్రతపై ఆందోళన చెందాల్సి ఉందని తెలిపింది. మీడియా నివేదికల ప్రకారం.. బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఇందులో కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై పాకిస్తాన్ జర్నలిస్టులు నేరుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు భద్రతకు…