వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు పసికూన అఫ్గాన్ జట్టు షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా అఫ్గాన్ ఆటగాళ్లు గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై గెలుపొందింది. దీంతో వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచింది.
ఇండియా-పాక్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ హాట్ స్టార్ లో అత్యధికంగా చూశారు. దాదాపు 3.5 కోట్లకు పైగా మంది చూశారు. ఇంతకుముందు కూడా భారత్-పాక్ మ్యాచ్ తలపడినప్పుడు 3 కోట్ల మంది చూశారు. తాజాగా ఆ రికార్డును ఇప్పుడు చెరిపేసింది. మూడు కోట్లకు పైగా మంది హాట్ స్టార్ మ్యాచ్ లైవ్ చూస్తుండటం.. ఇది డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రికార్డుగా చెబుతున్నారు.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా.. ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో హైఓల్టేజీ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుని.. పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు పంపించింది. అయితే భారత్ బౌలర్ల విజృంభణతో పాకిస్తాన్ బ్యాటర్లు చెతులేత్తేశారు. నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్తాన్ 191 పరుగులు చేసింది.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చాలా కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్‌తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై తన జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.