ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
షాహీన్ వేసిన బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కొంచెం తడబడ్డారు. అతను వేసిన అద్భుత బౌలింగ్‌తో 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఒక్కో పరుగు కోసం కష్టపడేలా చేశాడు. షాహీన్ 5.40 ఎకానమీ రేటుతో 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
న్యూజిలాండ్ మ్యాచ్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు సెలవులు లభించనున్నాయి. బిజీ షెడ్యూల్ కారణంగా మేనేజ్మెంట్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో మ్యాన్ అనంతరం వారికి ఏడు రోజుల పాటు విశ్రాంతి దొరకనుంది.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీల మోత మోగించారు. డేవిడ్ వార్నర్ 85 బంతుల్లో 100 పరుగులు చేయగా.. మార్ష్ 100 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇక వికెట్ కోల్పోకుండా పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం 32.2 ఓవర్లలో ఆసీస్ స్కోరు 231/0 ఉంది.
ప్రపంచకప్ 2023 మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఆతిథ్య భారత్.. గత సీజన్లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ మాత్రమే టోర్నీలో అజేయంగా నిలిచాయి. ఈ జట్లు నాలుగింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఈ వరల్డ్ కప్ లో ఈ జట్ల విజయ పరంపర కొనసాగుతుండడంతో భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరడం దాదాపు ఖాయం అని స్పష్టమవుతోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కాలుకు బంతి తగిలింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లిపోయాడు. అయితే చిన్న దెబ్బ కదా.. మళ్లీ వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దెబ్బ బలంగా తాకడంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్ లో కూడా ఆడలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటే ఇరుజట్ల మధ్య గట్టిపోటీ ఉంటుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్…
ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియా తర్వాతి మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కివీస్ జట్టు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి న్యూజిలాండ్ టీమ్ స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో టీమిండియాను ముందుగా ఆపాల్సి ఉంటుందని చెప్పాడు.