SA vs ENG: ఇంగ్లాండ్పై సౌతాఫ్రికా ఘన విజయం.. 229 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ పై సౌతాఫిక్రా ఘన విజయం సాధించింది. 229 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా సౌతాఫ్రికాను బ్యాటింగ్కు పంపించింది. అయితే సౌతాఫ్రికా బ్యాటింగ్లో ముందుగానే ఓపెనర్ క్వింటాన్ డికాక్ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి దిగిన రీజా హెండ్రిక్స్ (85), వాన్ డర్ దుసేన్ (60) పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఇక ఆ తర్వాత కెప్టెన్ మార్క్రామ్(42) పరుగుల మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
Read Also: Israel: హమాస్ డిప్యూటీ లీడర్ ఇంటిపై ఇజ్రాయిల్ దాడులు..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
మరో విధ్వంసకర ఆటగాడు క్లాసెన్ 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మార్కో జాన్ సెన్ కూడా 75 పరుగులు చేశారు. దీంతో సౌతాఫ్రికా స్కోరు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. అటు ఇంగ్లాండ్ బౌలింగ్లో టోప్లీ 3 వికెట్లు తీశాడు. గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీశారు.
Read Also: Mangalavaram: మంగళవారం అని అందుకే పెట్టాం… ఆ సామెత పట్టించుకోవద్దు: అజయ్ భూపతి
ఇక ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లలో మార్క్ ఉడ్ (40) పరుగులు తప్పితే.. మిగతా బ్యాటర్లలో ఎవరూ పెద్ద స్కోరు చేయలేదు. మలన్ (6), జో రూట్ (2), బెన్‌స్టోక్స్ (5) లు సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా.. హ్యారీ బ్రూక్ (17), జోస్ బట్లర్ (15), డేవిడ్ విల్లీ (12) పరుగులు చేసి మరో ఓటమిని చవిచూశారు. ఇప్పటికే ఆఫ్ఘాన్ పై ఓడి డిసాపాయింట్లో ఉన్న డిపెండింగ్ ఛాంపియన్ మరో ఓటమి పాలయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ మూడు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రబాడ, కేశవ్ మహరాజ్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!