AUS vs PAK: ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 45.3 ఓవర్లలో పాకిస్తాన్ 305 పరుగులు చేసి ఆలౌటైంది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 4 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Karthika : రంగం భామ ఎంగేజ్మెంట్..? వైరల్ అవుతున్న పిక్స్..
ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ లో ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ తొలి వికెట్‌కు 134 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పింది. షఫీక్ 64 పరుగులు, ఇమామ్ 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులు, సౌద్ షకీల్ 30 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 26 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. వీరు తప్ప మిగతా ఏ బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఒకానొక సమయంలో పాకిస్థాన్ బ్యాటింగ్ చూస్తుంటే లక్ష్యాన్ని చేరుకోగలదని అనిపించినా.. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రం పాకిస్తాన్ బ్యాటర్లను తిప్పేశాడు. ఆడమ్ జంపా 10 ఓవర్లలో 53 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. బాబర్ ఆజం, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్‌ల వికెట్లు తీశాడు.
Dhordo Village: ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ‘ధోర్డో’.. ఫొటోలను షేర్ చేసిన ప్రధాని
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ 259 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆస్ట్రేలియాకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ మినహా ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఎవరూ 25 పరుగుల ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. పాకిస్తాన్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది చెలరేగడంతో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లను పెవిలియన్ కు పంపించాడు. తాను అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ పై విజయంతో పాయింట్ల పట్టికలో భారీ మార్పులు జరిగాయి. ఇంతకుముందు 8వ స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు.. ఒక్కసారిగా 4వ స్థానానికి ఎగబాకింది. ఇక పాకిస్తాన్ 5వ స్థానంలో ఉంది