IND vs NZ: ఇండియా-న్యూజిలాండ్ మధ్య కీలక పోరు జరుగుతుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఈ రెండు టీమ్ లు నాలుగింటిలో నాలుగు గెలిచి అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఏ జట్టు ఓడినా.. పాయింట్ల పట్టికలో కిందకు వెళ్లిపోతారు. గెలిచిన జట్టు అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయితే ఇప్పటికే ధర్మశాలలో ఈ జట్ల మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
Read Also: Ambati Rambabu: చంద్రబాబు రాజకీయ పల్లకి మోయడానికి పవన్ ఉన్నాడు..
మ్యాచ్ ఆరంభంలోనే సిరాజ్ న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ కాన్వే వికెట్ తీసి భారత్ కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత మహమ్మద్ షమీ కూడా విల్ యంగ్ తీశాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో భారత్ విజయంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు.
Read Also: Israel: హిజ్బుల్లా డేంజరస్ గేమ్ ఆడుతోంది.. లెబనాన్‌ని యుద్ధంలోకి లాగుతోంది..
2011 ప్రపంచకప్ లో లీగ్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అయినా చివరకు టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుంది. ఆ సమయంలో కెప్టెన్ ధోనీ చెప్పిన ఓ విషయం గుర్తుకు వస్తోంది. ‘కొన్ని సందర్భాల్లో లీగ్ ఫార్మాట్ లో ఓటమి పాలవ్వడం మంచిదే. ఎందుకంటే తప్పకుండా గెలవాల్సిన సెమీ ఫైనలో లేక ఫైనలో అయితే అప్పుడు వణుకు పుడుతుంది’ అంటూ రవిశాస్త్రి అన్నారు.