న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వరల్డ్‌కప్ 2023లో మహమ్మద్ షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
న్యూజిలాండ్ ఆటగాళ్లకు పాకిస్తాన్ షెహర్ షిన్వారీ ఆఫర్ ఇచ్చింది. ఈసారి న్యూజిలాండ్ బౌలర్ జిమ్మీని ఉద్దేశించి ట్వీట్ చేసింది. ‘‘హే జిమ్మీ నీష్ (జేమ్స్ నీషామ్) నీవు భారత జట్టును ఓడిస్తే గనుక, మేము పాకిస్థానీలం నిన్ను తదుపరి ప్రధానిగా ఎన్నుకుంటాం’’అంటూ ఓ కామెడీ ట్వీట్ చేసింది. అయితే ఇవాళ్టి మ్యాచ్ లో జేమ్స్ నీషామ్ ఆడటం లేదు. అయినా షెహర్ కు ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాదు. అందుకే ఈ నటిని నెటిజన్లు తెగ ట్రోల్…
న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ విషయమై టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ క్రికెటర్ రవిశాస్త్రి స్పందించారు. ఈరోజు జరిగే గ్రూప్ దశ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఇండియా ఓటమి పాలైనా తాను పెద్దగా పరిగణనలోకి తీసుకోబోనని రవిశాస్త్రి పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సూచనను ఈ సందర్భంగా శాస్త్రి గుర్తు చేశారు.
2023 వన్డే ప్రపంచ కప్‌లో రేపు (ఆదివారం) భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, న్యూజిలాండ్‌లు ఇప్పటి వరకు ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్.
ప్రపంచకప్ 2023లో శ్రీలంక ఎట్టకేలకు తన ఖాతా ఓపెన్ చేసింది. లక్నోలో నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అసలు ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్ జట్టు గెలవడం కంటే మంచి ప్రదర్శన చూపించారు.
ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్‌కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్‌లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్‌లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్‌లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి.